అనసూయ ఫీలింగ్ అదేనట!!

Update: 2016-07-23 12:45 GMT
హాయ్ యాంకర్ అనసూయ అటు టీవీలు.. ఇటు సినిమాలతో పాటు సోషల్ మీడియాను కూడా బాగానే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అడపాదడపా కాకుండా.. ఫ్రీక్వెంట్ గానే సోషల్ సైట్లలో పోస్టులు చేస్తూ ఉంటుంది. అటు సినిమా సంగతులు.. ఫోటో షూట్స్ తో పాటు.. ఇటు పర్సనల్ ఫీలింగ్స్ ను కూడా బాగానే షేర్ చేస్తుంది.

 రీసెంట్ గా ఓ ఫోటోను షేర్ చేసిన ఈ హాటీ.. తన ఫీలింగ్ అదే అంటోంది. 'ఇతరులు నీ గురించి ఎందుకు మాట్లాడుకుంటారంటే.. వారి గురించి మాట్లాడితే ఎవరు వినరు కాబట్టి..' ఇదీ ఆ ఫోటోలో ఉన్న మ్యాటర్. దీన్ని షేర్ చేసిన అనసూయ' హహహహహ.. ఎప్పుడూ నేను మాట్లాడేది గురించి కూడా దీని గురించే' అని ట్వీట్ చేసింది. ఈ కోట్ కి బాగానే కనెక్ట్ అయిన అనసూయ.. తన ఫీలింగ్ ని ఫ్యాన్స్ తో పంచుకోకుండా ఉండలేకపోయిందన్న మాట. స్కిన్ షో విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేని ఈ హాటీ.. ఈ మధ్య ఫోటోషూట్స్ తో రెచ్చిపోతోంది.

వీటికి తోడు.. ఐటెమ్ సాంగ్స్ కు అనసూయ సై అనిందనే రూమర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే.. కొత్తగా సినిమాలేమీ సైన్ చేయకపోయినా.. ఈ హాట్ బ్యూటీకి డిమాండ్ మాత్రం చాలా ఎక్కువే ఉంది.
Tags:    

Similar News