• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ చెల్లెలు పాత్ర కోసం...

పవన్ చెల్లెలు పాత్ర కోసం కర్చీఫ్

By - Tupaki Desk
Update: 2016-11-10 17:30 GMT
బస్టాప్ మూవీతో తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా గుర్తింపు పొందడమే కాదు.. మరికొన్ని అవకాశాలు కూడా దక్కించుకుంది. అయితే.. హీరోయిన్ గా ఇక్కడ మాత్రం సెట్ కాలేక.. తమిళంలోకి వెళ్లిపోయి అక్కడ వరుసగా సినిమాలు చేసేస్తోంది. చేతిలో నాలుగైదు సినిమాలతో స్పీడ్ గానే ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగులో తిరిగి సత్తా చాటడం కోసం వేసిన స్కెచ్ చూసి చాలామందికి షాక్ కొట్టేసింది.

సాధారణంగా ఏ అప్ కమింగ్ హీరోయిన్ కూడా.. చెల్లెలి పాత్ర చేసేందుకు ఉత్సాహం చూపదు. ఆఫర్ వచ్చినా కుదరదు పొమ్మనే చెబుతుంటారు. కానీ ఆనంది మాత్రం ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్న ఈ భామకు ఎదురు కాగా.. 'తెలుగులో అందరు హీరోలు నాకు ఇష్టమే. అయితే.. పవన్ కళ్యాణ్ సార్ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం. ఒక్క సినిమాలో అయినా ఆయనకు చెల్లెలుగా నటించాలన్నది నా డ్రీమ్' అనేసింది ఆనంది.

ప్రస్తుతం కాటమరాయుడు చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ తోను.. ఆ వెంటనే ఏఎం రత్నం నిర్మాణంలో.. నీసన్ దర్శకత్వంలోను ఓ మూవీ చేయనున్నాడు. వేదాలం రీమేక్ గా ఏఎం రత్నం నిర్మించనున్న ఈ మూవీ.. సిస్టర్ సెంటిమెంట్ బేస్డ్ గా నడుస్తుంది. ఆ రోల్ తనకు ఇమ్మంటూ ఇన్ డైరెక్టుగా ఆనంది ఆఫర్ ఇచ్చిందనే విషయం చాలామందికి అర్ధమైపోయింది. మరి ఉత్సాహం చూపిస్తున్న తెలుగమ్మాయికి ఆ రోల్ దక్కుతుందో.. లేక ఇంకెవరైనా స్టార్ హీరోయిన్ ని వెతుక్కుంటారో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని నెలలు పడుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anandh 
  • Pawan kalyan 
  • Telugu news 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS