• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అనగనగా ఓ అతిథి' నుంచి...

'అనగనగా ఓ అతిథి' నుంచి పాయ‌ల్ 'మల్లిక' లుక్‌..!

By - Tupaki Desk
Update: 2020-10-30 15:30 GMT
తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వంద శాతం తెలుగు ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చింది ''ఆహా'' ఓటీటీ. కరోనా సమయంలో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లు మరియు కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'ఆహా' ఇప్పుడు ''అనగనగా ఓ అతిథి'' అనే చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసింది. 'Rx 100' బ్యూటీ పాయల్‌ రాజ్‌ పుత్‌ - చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి చేతుల మీదుగా విడుదలైన 'అనగనగా ఓ అతిథి' ఫస్ట్‌ లుక్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ పాయల్‌ రాజ్‌ పుత్‌ లుక్ ని విడుదల చేసారు.

'అనగనగా ఓ అతిథి' చిత్రంలో పాయల్‌ రాజ్‌ పుత్‌ 'మల్లిక' అనే సాధారణ యువతి పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్ లో పాయల్ చేతిలో లాంథర్ ని పట్టుకొని ఆ వెలుతురులో ఎవరి కోసమో చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ దర్శకత్వం వహించారు. పేదరికంలో నివస్తున్న ఓ కుటుంబంలోకి అనుకోని ఓ అతిథి వచ్చిన తరువాత వారికి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ ఉంటుందని తెలుస్తోంది. దురాశ, కామం, అత్యాశ వంటి ఎలిమెంట్స్‌ కు ఎమోషనల్ డ్రామా - సస్పెన్స్‌ కలిపి ఊహించని మలుపులతో తెరకెక్కించిన సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ అని మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి సంగీతం అందించారు. 'అనగనగా ఓ అతిథి' చిత్రం నవంబర్‌ 13న 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది.
Tags:    
  • Anaganaga o Athidhi 
  • Aha 
  • Nov 13 
  • Payal Rajput 
  • Poster 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS