• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా.. బచ్చన్ సార్...

సైరా.. బచ్చన్ సార్ వస్తున్నారహో

By - Tupaki Desk
Update: 2018-03-24 16:48 GMT
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సైర సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తరువాత ఆ స్థాయిలో వస్తోన్న భారీ బడ్జెట్ సినిమా కావున ఇతర సినిమా ఇండస్ట్రీల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా గత కొన్ని నెలల నుంచి సెట్స్ పైకి వెళుతున్నట్లే అనిపించినా మళ్లీ బ్రేక్ పడుతోంది.

అయితే ఈ సారి ఆ విధంగా కాకూడదని నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే సినిమాలో భారీ తారగణాన్ని సెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలతో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ఈ నెల 28 నుంచి హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో సినిమా షూటింగ్ జరగనుంది. అమితాబ్ బచ్చన్ డేట్స్ కూడా దాదాపు ఫైనల్ అయ్యాయి. మూడు రోజుల పాటు బచ్చన్ ఇక్కడే ఉండనున్నారు.

ఇక ఆ తరువాత మిగతా నటీనటులకి సంబంధించిన సీన్స్ ను దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. మొదట చిరంజీవి సురేందర్ రెడ్డి పై కొంచెం అనుమానంగా ఉన్నా.. ఆ తరువాత అతని కాన్ఫిడెన్స్ కి ఫిదా అయ్యారట. ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ రంగస్థలం సినిమా ఈ నెల 30న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.
Tags:    
  • Amitabh Bachchan 
  • Chiranjeevi 
  • Sye Raa Narasimha Reddy 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS