అమీతుమీ... భ‌లే ఆడింది సుమీ

Update: 2017-07-03 08:15 GMT
ఇప్పుడొస్తున్న‌వ‌న్నీ వారం రోజుల సినిమాలే.  మ‌రో శుక్ర‌వారం వ‌చ్చేస‌రికి చాలా సినిమాల అడ్ర‌స్ గ‌ల్లంతైపోతుంటుంది. తొలి వీకెండ్ వ‌సూళ్లని చూసుకోవ‌డం ఆ వెంట‌నే స‌ర్దేయ‌డం అన్న‌ట్టుగా ఉంటుంది వ్య‌వ‌హారం. ఇక స‌త్తా లేని సినిమాల్నైతే ఎగ్జిబిట‌ర్లు ఒక‌ట్రెండు రోజుల్లోనే తీసేస్తుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ సినిమా వారం - ప‌ది రోజులపాటు  మంచి క‌లెక్ష‌న్ల‌తో ఆడిందంటే మాత్రం అదో పెద్ద విశేషం కిందే లెక్క‌. 

అయితే చిన్న సినిమాగా వ‌చ్చిన అమీతుమీ మాత్రం తెగ ఆడేసింది. ఏకంగా అర‌వై సెంట‌ర్ల‌లో 25 రోజుల్ని పూర్తి చేసుకొని, దిగ్విజ‌యంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. చాలా త‌క్కువ వ్య‌యంతో, ఎలాంటి అంచ‌నాలు లేకుండా తెర‌కెక్కిన ఆ చిత్రానికి వ‌చ్చిన వ‌సూళ్లు చిన్న సినిమాల‌పై మ‌రింత మ‌క్కువ పెంచుకొనేలా చేస్తున్నాయి. అన్న‌ట్టు ఈ సినిమా శాటిలైట్ మార్కెట్లో కూడా అద‌ర‌గొట్టింది.  ప్ర‌ఖ్యాత ఈటీవీ రూ:2.25 కోట్ల‌కు శాటిలైట్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ లెక్క‌ల‌న్నీ చూస్తే సినిమాకి మంచి లాభాలొచ్చిన‌ట్టే. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి అష్టాచ‌మ్మా త‌ర్వాత తెర‌కెక్కించిన ఫ‌క్తు కామెడీ సినిమా ఇది. అష్టాచ‌మ్మా కంటే ఎక్కువ న‌వ్వులు ఈ సినిమాలో పండాయి. అందుకే చిత్రం ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకొంది.  సినిమాలో న‌టించిన అడ‌వి శేష్‌ - వెన్నెల కిషోర్‌ - అవ‌స‌రాల శ్రీనివాస్‌ - ఈషా రెబ్బా - అదితి - శ్యామ‌లాదేవిల‌కి మంచి పేరొచ్చింది. ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి ప్ర‌తిభ‌ని మ‌రోసారి ప‌రిశ్ర‌మ‌కి చాటి చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News