రీ ఎంట్రీలో అమల.. ఇంత హాట్ గా..

Update: 2016-12-30 14:05 GMT
రీ ఎంట్రీలో అమల.. ఇంత హాట్ గా..
అమలాపాల్ సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి. పెళ్లి చేసుకున్నంత మాత్రాన పెద్దగా గ్యాప్ తీసుకోలేదు కానీ.. ఎంచుకునే పాత్రల్లో మాత్రం వైవిధ్యం చూపించింది అమలాపాల్. కానీ ఇప్పుడు దర్శకుడు ఎ ఎల్ విజయ్ తో విడాకులు ఖాయం అయ్యాక.. అమల మొత్తం పద్ధతినే మార్చేసింది.

గతంలో కంటే ఎక్కువ గ్లామర్ కురిపించేస్తోంది. అమ్మ కణక్కు లాంటి మూవీ తర్వాత ఇప్పుడు కన్నడలో హెబ్బులి అనే మూవీలో నటిస్తోంది అమలాపాల్. రీసెంట్ ఈ మూవీకి సంబంధించిన  పోస్టర్స్ విడుదల చేశారు. కిచ్చా సుదీప్ హీరోగా యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమలాపాల్ విపరీతంగా రెచ్చిపోతోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే.. పెళ్లి చేసుకునేకంటే ఇప్పుడే ఎక్కువగా గ్లామర్ గా ఉందేమో అనిపించక మానదు. పొట్టి బట్టల్లో రెచ్చగొట్టడమే కాదు.. రొమాన్స్ లో కూడా పీక్స్ చూపించేస్తోంది అమలాపాల్.

వచ్చే ఏడాది అరడజనుకు పైగా ఈ అమ్మడు నటించిన సినిమాలు విడుదల కానుండగా.. వీటన్నిటిలోనూ అమలాపాల్ అందాలు స్పెషల్ అట్రాక్షన్ అవుతాయనండంలో సందేహం అక్కర్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News