తమిళ్ క్వీన్ 100 కోట్లు కొట్టింది

Update: 2017-05-04 06:29 GMT
'మైనా'తో తెలుగులోకి పరిచయమైన అమలాపాల్. తరువాత ఇద్దరమ్మాయిలతో నాయక్ వంటి స్టార్ సినిమాలు చేసినా.. పెద్దగా టాలీవుడ్ లో ఇంప్రెస్ చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు తమిళ్ మలయాళం కన్నడలో బాగా బిజీగా మారింది. డైరెక్టర్ విజయ్ నీ పెళ్లి చేసుకొని మళ్ళీ విడాకులు తీసుకొని వార్తలో తిరుగిన అమలాపాల్ ఇప్పుడు ఎట్టకేలకు తన పని వలన వార్తలోకి వస్తోంది. పదండి చూద్దాం.

కన్నడంలో కృష్ణ దర్శకత్వంలో వచ్చిన  ‘హెబ్బులి’ సినిమా  కిచ్చ సుదీప్‌ తో అమల జంటగా నటించింది. ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అవ్వడమే కాదు.. ఏకంగా 75 రోజుల జైత్ర యాత్ర కొనసాగించింది కూడా. అంతేనా..ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర  రూ.100 కోట్లను వసూలు చేసిన సినిమాగా రికార్డు సృస్టించింది. మొత్తానికి అమలా పాల్ కెరియర్ లో తొలి 100 కోట్ల క్లబ్ కు ఎక్కినట్టేగా. ఇకపోతే బాలీవుడ్‌ లో సంచలన విజయం  సాధించిన ‘క్వీన్‌’ మలయాళంలో నటి రేవతి దర్శకత్వం చేస్తున్నారు. ఇది తమిళ్ కూడా తీయబోతున్నారు. తమన్నాను ఈ ప్రాజెక్టు నుండి తప్పించాక.. ఇందులో అమలా పాల్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అమలాపాల్  రోజులు వచ్చాయి అన్నమాట.

ప్రస్తుతం చాలా  సినిమాలతో అమలాపాల్‌ బిజీగా ఉందిలే . సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటిస్తున్న ‘వేలైయిల్లా పట్టధారి 2’ సెట్స్ పై నడుస్తుంది. ఏజీఎస్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కల్పాత్తి ఎస్‌.అగోరం నిర్మాణంలో సుశి గణేశన్‌ దర్శకత్వంలో బాబీ సింహా సినిమాలో కూడా నటిస్తోంది. ఇంకా ప్రసన్ననటిస్తున్న ‘తిరుట్టు పయలే’, ఆక్సస్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ నిర్మాణంలో రామ్‌ దర్శకత్వంలో విష్ణు విశాల్‌ నటిస్తున్న ‘మిన్మిణి’ కూడా నిర్మాణంలో ఉంది. అలాగే  మురుగన్‌ నిర్మాణంలో  సిద్ధిక్‌ దర్శకత్వంలో అరవింద్‌స్వామి నటిస్తున్న ‘భాస్కర్‌ ఒరు రాస్కల్‌’ చిత్రాల్లో అమలాపాల్‌ నటిస్తోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News