అమల చెప్పేది మనం కూడా ఫాలో కావచ్చు

Update: 2015-06-30 22:30 GMT
ఎక్కడో నార్త్‌ ఇండియా నుంచి వచ్చి తెలుగువారి కోడలిగా చక్కగా ఇమిడిపోయింది అమల. అన్నేళ్ల పాటు గ్లామరస్‌ ఫీల్డ్‌లో ఉండి.. తనకు అలవాటు లేని మనుషుల మధ్య, సంస్కృతి సంప్రదాయాల మధ్య ఇమిడిపోవడం చిన్న విషయం కాదు. అక్కినేని వారి ఇంటి కోడలి గానే కాదు.. ఓ సామాజిక సేవకురాలిగా కూడా అమల తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ తరఫున ఆమె చేసే సేవా కార్యక్రమాల గురించి మనందరికీ తెలుసు. మూగ జీవాల మీద ప్రేమతో ఆమె 'వేగన్‌' మారారు. వేగన్‌ అంటే మూగజీవాల గురించి వచ్చే దేన్నయినా.. చివరికి పాలను కూడా ఆహారంగా తీసుకోని వాళ్లను వేగన్‌ అంటారు.

దీని గురించి మరింత వివరంగా చెబుతూ.. ''నేను చిన్నప్పుడే మాంసాహారం మానేశాను. ఎనిమిదేళ్ల కిందట వేగన్‌గా మారాను. పాలు కూడా తీసుకోను. ఐతే మహిళలకు పాలు చాలా ముఖ్యమని.. వయసు పెరిగాక ఎముకలు బలహీనమవుతాయని నాకు తెలుసు. ఐతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. పాలలో కంటే నువ్వుల్లో కాల్షియం ఎక్కువుంటుంది. గ్లాసుడు పాలల్లో 10 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటే.. 100 గ్రాముల నువ్వుల్లో వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కానీ పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందని డైరీ ఫామ్స్‌ ప్రకటనలిచ్చి ఆకర్షిస్తుంటాయి. నువ్వులు మంచివని ప్రచారం చేసుకోవడం రైతులకు తెలియదు కదా. అలాగే వేరుసెనగ పప్పు కూడా మంచిదే. అది తిన్నా కాల్షియం వస్తుంది. మనందరం ఏదైనా కొనాలంటే యాడ్స్‌ చూసే నిర్ణయం తీసుకుంటాం. అంతే తప్ప ఏది మంచిది ఏది కాదు అని ఆలోచించం'' అని చెప్పింది అమల. ఆమె చెప్పిన విషయాలు చాలామందికి తెలియవు. పాల గురించి ఆలోచించి వేగన్‌గా మారడానికి సందేహించే వాళ్లు ఈ సలహా పాటిస్తే బెటర్‌.

Tags:    

Similar News