శిరీష్ కూడా అదే డేట్ అంటున్నాడు

Update: 2017-03-09 05:19 GMT
శిరీష్ కూడా అదే డేట్ అంటున్నాడు
శ్రీరస్తు శుభమస్తు మూవీతో ఫామ్ లోకి వచ్చిన అల్లు శిరీష్.. ఆ వెంటనే మరో తెలుగు సినిమా చేసేయకుండా.. మలయాళ మూవీ అంగీకరించి ఆశ్చర్యపరిచాడు. అన్న బన్నీ ఇప్పటికే మల్లూవుడ్ లో కుమ్మేస్తోండగా.. కేరళలో అల్లు శిరీష్ కి ఇప్పుడీ బ్రాండ్ బాగా ఉపయోగపడనుంది. 1971: బెయాండ్ బోర్డర్స్ అనే టైటిల్ పై తెరకెక్కిన చిత్రాన్ని.. తెలుగులో 1971..భారత సరిహద్దు అనే టైటిల్ పై రిలీజ్ చేయబోతున్నారు.

అల్లు శిరీష్ మలయాళ అరంగేట్ర చిత్రానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. ఈ 1971 మూవీని ఏప్రిల్ 7న విడుదల చేయాలని డిసైడ్ చేశారు. మలయాళం.. తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. ఏప్రిల్ 7 డేట్ దగ్గరే ఆశ్చర్యం కలుగుతోంది. అదే రోజుకు వెంకటేష్ నటించిన గురు మూవీ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. మరోవైపు..  అదే రోజున మణిరత్నం తీస్తున్న లవ్ స్టోరీ చెలియా కూడా విడుదల కానుంది.

ఇప్పుడు అల్లు శిరీష్ కూడా రేస్ లో జాయిన్ అవడంతో.. పోరు మరింత రసవత్తరంగా మారింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈయన.. ఇప్పుడు గురు.. చెలియా చిత్రాలకు శిరీష్ తో కలిసి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం ఖాయం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News