అల్లు వారి ఫిల్మ్ స్టూడియో
హైదరాబాద్ లో కొత్త ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు కాబోతుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చాలా కాలంగా స్టూడియో నిర్మాణంపై ఆసక్తి ఉందట. కాని ఏవో కారణాల వల్ల స్టూడియో నిర్మాణం జరగలేదు. ఎట్టకేలకు అల్లు వారి కుటుంబం అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్బంగా అల్లు స్టూడియోస్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అల్లు కుటుంబం మొత్తం కలిసి ఈ స్టూడియో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. నేడు అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్బంగా మేము స్టూడియో నిర్మాణంకు సంబంధించిన ప్రకటన చేస్తున్నాం. త్వరలోనే స్టూడియో నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నట్లుగా అల్లు వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ గండిపేట శివారు ప్రాంతంలో ఇప్పటికే అల్లు వారు 10 ఎకరాల భూమిని సేకరించారట. అందులోనే ఈ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. అల్లు రామలింగయ్య 100వ జయంతి వరకు స్టూడియో పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అంటే ఏడాది కాలంలోనే స్టూడియో నిర్మాణంను పూర్తి చేసేందుకు అల్లు వారు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయంకు అంటే అల్లు రామలింగయ్య జయంతి సందర్బంగా ఈ స్టూడియోను ప్రారంభించాలని అల్లు ఫ్యామిలీ భావిస్తున్నారట. అల్లు అరవింద్ తనయుడు బాబీ.. బన్నీ.. శిరీష్ లు ముగ్గరు కూడా ఈ స్టూడియో నిర్మాణంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.