• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ సినిమాలో లక్కీ...

రామ్ సినిమాలో లక్కీ స్టార్‌

By - Tupaki Desk
Update: 2021-07-19 17:30 GMT
ఆది పినిశెట్టి ఒక వైపు తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూ మరో వైపు తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు లో ఈయన సరైనోడు సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక రంగస్థలం మరియు నిన్ను కోరి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సమంత నటించిన యూటర్న్ ఇంకా కొన్ని సినిమా ల్లో కూడా ఆది నటించి మెప్పించాడు. ఆ సినిమాల ఫలితాలు కూడా పాజిటివ్‌ గా వచ్చాయి. దాంతో ఆది అంటే టాలీవుడ్‌ కు లక్కీ స్టార్‌ గా పేరు వచ్చింది. తెలుగు సినిమాల్లో ఆయన నటిస్తే తప్పకుండా విజయం దక్కుతుందనే నమ్మకంతో కొందరు ఆయన్ను సెంటిమెంట్ తో తమ సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రామ్‌ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో ఆది పినిశెట్టిని ఎంపిక చేసినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

రామ్‌ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నాడు. సరైనోడు సినిమా లో అల్లు అర్జున్‌ కు ధీటుగా దాటిగా ఆది విలనిజం పండించి ఆకట్టుకున్నాడు. కనుక ఈ సినిమా లో కూడా ఆయన ఖచ్చితంగా విలన్ గా సక్సెస్ అవ్వడంతో పాటు రామ్‌ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ కు సరైన పోటీగా నిలిచేందుకు విలన్‌ గా ఆది ఖచ్చితంగా సూట్ అవుతాడని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ మరియు ఆదిల మద్య సన్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండటం ఖాయం అని ఇప్పటి నుండే అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

ఇక ఆది నటించిన రెండు తమిళ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. థియేటర్లు క్లోజ్ ఉండటం వల్ల ఆ సినిమా లను వాయిదా వేస్తూ వచ్చారు. కరోనా సెకండ్‌ వేవ్ ప్రభావం కాస్త తగ్గడం వల్ల సినిమాలు విడుదల అవుతున్నాయి. కనుక ఆది సినిమాలు విడుదల కాబోతున్నాయి. రామ్‌ సినిమా మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలను కూడా ఆది చేస్తున్నాడు. హీరోగా నటుడిగా బిజీగా ఉన్న ఆది ఎంట్రీ వల్ల రామ్‌ 19 సినిమా వెయిట్ పెరిగినట్లే అని.. తమిళంలో కూడా విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఖచ్చితంగా మంచి బిజినెస్ అవ్వడంతో పాటు మంచి వసూళ్లు అక్కడ నమోదు అవుతాయనే నమ్మకంను ట్రేడ్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Ram Pothineni 
  • Aadhi Pinisetty 
  • RAPO19 
  • Tollywood 
  • Movie News 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS