మెగా సీక్రెట్ సాంటా ఎవ‌రో తెలుసా?

Update: 2019-12-24 17:04 GMT
ప్ర‌పంచమంతా క్రిస్మ‌స్ సంబ‌రాల్లో మునిగి తేల్తోంది. సెల‌బ్రిటీల ఇళ్లలోనూ ప్ర‌త్యేకించి క్రిస్మ‌స్ వేడుక‌ల్ని ఘ‌నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ ఓచోట క‌లుసుకుని స‌ర‌దాగా సాంటా క్లాజ్ మూవ్ మెంట్స్ ని చీర‌ప్ చేస్తూ గ‌డిపే అరుదైన సంద‌ర్భ‌మిది. ఇలాంటి రేర్ మూవ్ మెంట్ ని మిస్ చేసుకునేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేరు.

ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఏ పండ‌గ వ‌చ్చినా ఒక‌టే సంద‌డి క‌నిపిస్తోంది. వినాయ‌క చ‌వితి- ద‌స‌రా- దీపావ‌ళి - ఉగాది- సంక్రాంతి ఇలా ఏ ముఖ్య‌మైన పండ‌గ వ‌చ్చినా ఫ్యామిలీ స‌భ్యులంతా ఓ చోట చేరి స‌ర‌దాగా స్పెండ్ చేస్తున్నారు. పూజ‌లు పున‌స్కారాలు.. పార్టీల‌తో సంప్ర‌దాయాన్ని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాగే క్రిస్టియ‌న్ పండ‌గ అయినా క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ పైనా అంతే మ‌క్కువ క‌న‌బ‌రుస్తున్నారు. ఒక ర‌కంగా బాలీవుడ్ లోనే క‌నిపించే ఈ క‌ల్చ‌ర్ తెలుగు సెల‌బ్రిటీ లోగిళ్ల‌లోనూ క‌నిపిస్తోంద‌ని చెప్పొచ్చు.

ఇదిగో మెగా హోమ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాంటా గా మారారు. త‌ను తొడుక్కున్న ఆ రెడ్ టీష‌ర్ట్ ని చూపిస్తూ మెగా డాట‌ర్ శ్రీ‌జ  ల‌వ్ లీ సాంటా ష‌ర్ట్ ని మిస్ కాలేను అంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో మెగాభిమానుల్లో వైర‌ల్ గా మారింది. బ‌న్ని ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిత్తూరు- బ్యాంకాక్ లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో భారీ షెడ్యూల్స్ ని సుకుమార్ ప్లాన్ చేశార‌ని ఇంత‌కుముందు ప్రచార‌మైంది. క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ ముగించి బ‌న్ని సెట్స్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ప‌నిలోప‌నిగా అల వైకుంఠ‌పుర‌ములో ప్ర‌చారంలోనూ బిజీ అవుతాడేమో!


Tags:    

Similar News