వైకుంఠపురం ఆరంభం మాత్రమే
అల్లు అర్జున్ 2020 సంవత్సరంలో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. ఇతర హీరోలకు 2020 ఒక చేదు జ్ఞాపకంగా నిలిచి పోయినా కూడా బన్నీకి మాత్రం చాలా స్వీట్ మెమోరీగా నిలిచి పోయింది అనడంలో సందేహం లేదు. అదే విషయాన్ని సామ్ జామ్ లో సమంత ప్రస్థావించగా బన్నీ స్పందిస్తూ అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ తో గత ఏడాది చాలా పాజిటివ్ గా ప్రారంభం అయ్యింది. దాంతో అక్కడి నుండి అన్ని పాజిటివ్ లు గానే సాగాయి. గత ఏడాదిలోనే అల్లు స్టూడియోకు ఫౌండేషన్ వేయడంతో పాటు ఆహా ఓటీటీని కూడా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా 2020 లో అవ్వడం వల్ల గత ఏడాది మాకు ఎప్పటికి గుర్తుండి పోయేదిలా మిగిలి పోయిందని అన్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే అల వైకుంఠపురంలో సినిమా చాలా సంతృప్తిని ఇచ్చింది. ఆ విజయంతో ఆగిపోకుండా మరింత మంచి కంటెంట్ ను ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు అద్బుతాలు చూస్తారు అంటూ అభిమానులకు బన్నీ హామీ ఇచ్చాడు. సమంతతో కలిసి సామ్ జామ్ ను ఫుల్ ఎంటర్ టైన్ గా మార్చేసిన బన్నీ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
భుజం గాయం అయిన సమయంలో సినిమాలు ఎంత వరకు సాధ్యం అయితే అంత వరకు చేస్తూనే ఉండాలని.. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కనుక కష్టపడ్డన్ని రోజులు కష్టపడాలనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. జీవితాంతం కూడా సినిమాలు చేస్తూనే ఉంటాను. అల్లు స్టూడియో మేము ఉన్నా లేకున్నా సినిమా కు మా వంతు బాధ్యత అన్నట్లుగా ఏర్పాటు చేస్తున్నామని బన్నీ చెప్పుకొచ్చాడు.