బాహుబలిలో భల్లాలదేవ..రుద్రమలో గోనగన్నారెడ్డి

Update: 2015-10-09 11:30 GMT
ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూసిన మరో సినిమా థియేటర్లకు వచ్చేసింది. దర్శకుడు గుణశేఖర్ చెక్కిన రుద్రమదేవి శిల్ప సౌందర్యాన్ని చూసి తెలుగు ప్రేక్షుకులు ఎంజాయ్ చేస్తున్నారు. రుద్రమదేవి సినిమా సందడి చేస్తున్న వేళ.. సరికొత్త వాదనలు వినిపిస్తున్నాయి.

గురువారం అర్థరాత్రి స్పెషల్ షో వేసిన తర్వాత చాలామంది ప్రముఖులు దర్శకుడు గుణశేఖర్ కు అభినందనలు తెలిపారట. ఇక.. బన్నీ ఫ్యాన్స్ కి అయితే.. దసరా పది రోజుల ముందే వచ్చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు ఒక పోలిక తెస్తున్నారు. బాహుబలిలో ఏ విధంగా అయితే.. రానాకు స్పెషల్ ఇమేజ్ తీసుకొచ్చి.. ఆయన్ను ఒక రేంజ్ కి తీసుకెళ్లిందో.. రుద్రమదేవి సినిమాలో అల్లుఅర్జున్ నటించిన గోనగన్నారెడ్డి పాత్రకు బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ప్లాట్ అయిపోతున్నారట.

తెలంగాణ యాసలో అతగాడి ఆవేశపూరిత డైలాగులకు క్లాప్స్ మీద క్లాప్స్ మోగుతున్నాయట. ఇక.. సినిమాలో ‘ఏ గమ్మునుండవయ్యా’ అంటూ పలికిన డైలాగ్ కు థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్  విపరీతంగా ఉందని మెచ్చేసుకుంటున్నారు. బహుబలికి స్పెషల్ అట్రాక్షన్ భల్లాల దేవుడైతే.. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి అని అభివర్ణిస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ కు ఇంతకు మించి కావాల్సిందేముంది?
Tags:    

Similar News