• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున్ రెడ్డిని బన్నీ...

అర్జున్ రెడ్డిని బన్నీ భలే పొగిడేశాడే..

By - Tupaki Desk
Update: 2018-04-08 04:32 GMT
గత ఏడాది ‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత తెలుగు సినిమాల్లో అత్యధిక చర్చ జరిగింది ‘అర్జున్ రెడ్డి’ గురించే. ఈ చిత్రంపై ప్రశంసలు ఏ స్థాయిలో కురిశాయో.. దానిపై విమర్శలూ అదే స్థాయిలో చెలరేగాయి. దీనిపై ఎన్నెన్ని కాంట్రవర్శీలు నడిచాయో. వాటి సంగతి ఎలా ఉన్నా ఇది టాలీవుడ్లోనే కాక వేరే ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఫిలిం మేకింగ్ విషయంలో ఇది నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎందరినో ఇన్ స్పైర్ చేసింది. తెలుగు సినిమాను ఒక కొత్త దారి వైపు నడిపించింది. ఈ చిత్రాన్ని ఎంతో మంది సినీ ప్రముఖులు ఇష్టపడ్డారు. దాని గురించి గొప్పగా మాట్లాడారు. ఈ జాబితాలోకి తాజాగా అల్లు అర్జున్ కూడా చేరాడు. ఈ మధ్య కాలంలో తనకు అత్యంత నచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’నే అంటూ దాని గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్పగా మాట్లాడాడు బన్నీ.

‘‘ఓ సినిమా చూస్తే నేను చాలా ప్రభావితం అవుతుంటాను. మనసుకు నచ్చిందంటే అది చాలా రోజులు నన్ను వదిలిపోదు. ఈ మధ్య నాకు బాగా నచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా పేరు చెప్పగానే చాలామందికి డ్రగ్స్.. సెక్స్.. ఇవే గుర్తుకొస్తాయి. నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ చిత్రంలో నటీ నటుల ప్రతిభ.. దర్శకుడు కథను నడిపించిన విధానం.. డైలాగులు చెప్పిన పద్ధతి.. ఆ షాట్ డివిజన్.. ఇవన్నీ చాలా చాలా నచ్చాయి. వారం రోజుల పాటు ఆ సినిమా నా మైండ్లో తిరుగుతూనే ఉంది’’ అని బన్నీ చెప్పాడు. అల్లు అర్జున్ స్థాయి హీరోకు ఈ చిత్రం ఇంత బాగా నచ్చడం ఆసక్తి రేకెత్తించే విషయమే. ఐతే సినిమా చూసిన వాడు సోషల్ మీడియాలో దీని గురించి ఎప్పుడూ.. ఎక్కడా స్పందించలేదు. మహేష్ బాబు సైతం ఈ సినిమా మెచ్చి.. ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడిన సంగతి తెలిసిందే.
Tags:    
  • Allu Arjun 
  • Arjun Reddy Movie 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS