బన్నీ పంతులు.. చివరకు పోలీసా??

Update: 2017-02-21 05:22 GMT
అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డీజే-దువ్వాడ జగన్నాధం. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రివీల్ చేశారు. సాంప్రదాయ బ్రాహ్మిన్ లుక్ లో బన్నీ గెటప్ అదిరిపోయిందని అందరూ అంటున్నా.. ఈ రోల్ పై మాత్రం రకరకాల టాక్స్ వినిపించాయి.

మొదటగా ఈ సినిమా అదుర్స్2 టైపులో ఉంటుందని.. ఆ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన చారి కేరక్టర్ మాదిరిగానే స్టైలిష్ స్టార్ రోల్.. కేరక్టరైజేషన్ ఉంటాయని అన్నారు. ఫస్ట్ లుక్ రివీల్ చేసిన తర్వాత.. అగ్రహారంలో నడిచే కేటరింగ్ సర్వీస్ నడుపుతాడని అర్ధం కావడంతో.. మరో టాక్ బయల్దేరింది. మైకేల్ మదన కామ రాజులో కమల్ హాసన్ చేసిన పాత్రలా బన్నీ రోల్ ఉంటుందని అంటున్నారు. అయితే.. అసలు విషయం ఏంటంటే.. డీజేలో బన్నీ చేస్తున్న పాత్రలో రెండు రకాల షేడ్స్ ఉంటాయట. కేరక్టర్ ఒకటే అయినా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర ఇది అని తెలుస్తోంది.

అమాయకుడైన బ్రాహ్మణుడిగా ఉంటూనే.. ఓ మిషన్ లో భాగంగా పోలీసులకు సీక్రెట్ గా సమాచారం అందించే ఇన్ఫార్మర్ అని.. చివరకు పోలీస్ కేరక్టర్ అని తేలుస్తారని తెలుస్తోంది. స్టోరీలో ఇదే కీలకమైన పాయింట్ అని.. ఈ కేరక్టర్ ఛేంజ్ చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. అలా డీజే మూవీలో బన్నీ పంతులు.. ఈ సినిమాలో చివరకు పోలీస్ గా అవతారం ఎత్తుతాడన్నది లేటెస్ట్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News