• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ సినిమా కోసం ఆ...

బన్నీ సినిమా కోసం ఆ డైరెక్టర్ కి భారీగా ఆఫర్ చేస్తున్నారట...!

By - Tupaki Desk
Update: 2020-05-24 12:26 GMT
దర్శకునిగా మారిన రచయితలలో కొరటాల శివ ఒకరు. 'బృందావనం' 'మున్నా' మరియు 'బిందాస్' చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఒక్క విజయంతో టాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు కొరటాల శివ. ఆ తర్వాత 'శ్రీమంతుడు' 'జనతా గ్యారేజ్' మరియు 'భరత్ అనే నేను' వంటి అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను అందించారు. టాలీవుడ్ లో 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టరుగా.. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు కొరటాల శివ. ఓ సోషల్ ఇష్యూకి కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో.. దాన్ని సమపాళ్లలో అందించే సత్తా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ అని చెప్పవచ్చు. అందుకే ఈయన దర్శకత్వంలో సినిమా అంటే అది పక్కా హిట్ అనే ప్రేక్షకుల భావనకు వచ్చేస్తారు. సూపర్ స్టార్ మహేష్ అంతటి వాడే కనీసం క్యారెక్టర్ ఏంటని అడగకుండా ఆయన సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు కొరటాల స్టామినా. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా 'ఆచార్య' సినిమా తర్వాత కొరటాల శివ ఏ హీరోతో సినిమా తీయబోతున్నాడో అనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది. అయితే గత కొన్ని రోజులుగా కొరటాల నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్  చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొరటాల చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి బాగా నచ్చిందని.. ప్రస్తుతం దొరికిన ఈ సమయంలో కొరటాల బన్నీని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడని న్యూస్ స్ప్రెడ్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్న గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ ఈ సినిమా కోసం డైరెక్టర్ కొరటాల శివకు ఏకంగా 13 కోట్లు ఆఫర్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని భావిస్తున్న అల్లు అరవింద్ కొరటాల - బన్నీ కాంబోలో తెరకెక్కబోయే సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాలని అనుకుంటున్నాడట. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా మరియు వేణు శ్రీరామ్ 'ఐకాన్' సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.


Tags:    
  • Allu Arjun 
  • Pushpa Movie 
  • Telugu NEws 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS