అబ్బే.. రిలీజయ్యాకే బన్నీ తేల్చేది

Update: 2015-11-09 09:30 GMT
నిన్నగాక మొన్న గోపిచంద్‌ మలినేని తో తన తదుపరి ప్రాజెక్టు చేస్తున్నాడనే న్యూస్‌ వచ్చింది. అలాగే మరో కొత్త డైరక్టర్ తో కూడా స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన తదుపరి సినిమా చేస్తాడని చెప్పుకొచ్చారు కొందరు. కాని బన్నీ మాత్రం ఈ సినిమాలపై డెసిషన్‌ ఇంకా తీసుకోలేదట. దానికో రీజన్‌ ఉందట మరి.

ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా తాలూకు రిజల్టు చూసిన తరువాతనే తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాడట మన అల్లు హీరో. అందుకే రేసుగుర్రం రిలీజ్‌ అయ్యాక కాని సన్నాఫ్‌ సత్యమూర్తి సైన్‌ చేయలేదు. సత్యమూర్తి బయటకొచ్చి కలెక్షన్లు ఇంప్రూవ్‌ అయ్యాక కాని బోయపాటి శ్రీనుతో సరైనోడు సినిమాను ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు తన మాస్‌ వేషాలు ఎలా క్లిక్‌ అవుతాయో చూశాక కాని మరో సినిమాను ఒప్పుకోడట. ఇలాగైతే సంవత్సరానికి బన్నీ ఒక్క సినిమాను అందించడమే గగనం అయిపోతుంది మరి. ఆల్రెడీ స్టార్‌ హీరో స్టాటస్‌ వచ్చేశాక.. ముందు సినిమా రిజల్టు చూసి తరువాత సినిమా ఒప్పుకోవడం ఎందుకు? ఒక సినిమా చేస్తూ మరో కథను ఓకే చేసుకోవచ్చుగా?

ఏంటో ఈ మెగా హీరోలు.. పవన్‌ కళ్యాన్‌ - రామ్‌ చరణ్‌ - అల్లు అర్జున్‌.. ముగ్గురూ అంతే.. ఒక సినిమా పూర్తిగా పూర్తయ్యి రిలీజ్‌ అయ్యాక కాని మరో మూవీ ఒప్పుకోవట్లేదు. పైగా సినిమా సినిమా మధ్యలో గ్యాప్‌ కూడా బాగా పెరిగిపోతుంది. ఉన్నందరిలో కాస్త ఫాస్టుగా సినిమాలు చేస్తోంది సాయిధరమ్‌ తేజ్‌ ఒక్కడేనేమో. సర్లేండి.. బన్నీ తదుపరి సినిమా ఏంటనేది మాత్రం.. సరైనోడు రిలీజ్‌ తరువాతే తెలిసేది.
Tags:    

Similar News