బీస్ట్ తో పోజిచ్చిన బన్నీ

Update: 2019-08-25 04:16 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండన్న సంగతి తెలిసిందే.  తన పిల్లలకు సంబంధించిన ఏ విషయం ఉన్నా.. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయినా.. ఏదైనా వెహికల్ కొన్నా వెంటనే అభిమానులతో ఆ విషయాన్ని పంచుకుంటాడు.  కొద్ది రోజుల క్రితం స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న వ్యానిటీ వ్యాన్ ఫోటోలను కూడా బన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.  తాజాగా అలాంటిదే మరో సందర్భం వచ్చింది.

స్టైలిష్ స్టార్ ఒక కొత్త కార్ ను కొనుగోలు చేయడంతో ఆ వాహనంతో పాటు ఒక ఫోటో దిగి మరీ అభిమానులతో పంచుకున్నాడు. ట్విట్టర్ ఖాతా ద్వారా ఫోటో పోస్ట్ చేసి "ఇంటికి కొత్త కారు వచ్చింది.  నేను దానికి బీస్ట్ అని పేరు పెట్టాను. ఎప్పుడు నేను ఏది కొనుగోలు చేసినా నా మనసులో ఒకటి ఉంటుంది.. అదే కృతజ్ఞత.  #రేంజ్ రోవర్ @AA బీస్ట్" అంటూ ట్వీట్ చేశాడు.  బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ లుక్ సూపర్ గా ఉంది.  దాని పక్కనే నిలుచుని చిరునవ్వులు చిందిస్తూ ఒక స్టైలిష్ పోజు ఇచ్చాడు స్టైలిష్ స్టార్.

సినిమాల విషయానికి వస్తే బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags:    

Similar News