అక్కడ బన్నీ క్రేజ్ మామూలుగా లేదు

Update: 2016-05-26 17:45 GMT
ఎలా మొదలైందో ఏంటో కానీ.. కేరళలో మన అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. మనోడి సినిమా విడుదలవుతోందంటే అక్కడి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ కనిపిస్తూ ఉంటుంది. బన్నీ ప్రతి సినిమా కూడా అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. గత ఏడాది ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి కూడా బాగానే హంగామా కనిపించింది. ఐతే ఆ సినిమా మోస్తరుగా ఆడిందంతే. ఆల్రెడీ తెలుగులో డివైడ్ టాక్ రావడం కూడా అందుకు ఓ కారణం. ఐతే బన్నీ లేటెస్ట్ మూవీ ‘సరైనోడు’ మాత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయి.. మలయాళంలోకి వెళ్తోంది. తెలుగులో వచ్చిన నెల రోజుల తర్వాత ఈ శుక్రవారమే ‘సరైనోడు’ మలయాళ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి ‘యోధవ్’ అని పేరు పెట్టారు.

యోధవ్ రిలీజ్ నేపథ్యంలో కేరళలో బన్నీ అభిమానుల హంగామా మామూలుగా లేదు. పెద్ద నగరాల్లో భారీ హోర్డింగులు.. ఫ్లెక్సీలతో మోత పుట్టిస్తున్నారు. కొందరు తమ కార్లను కూడా యోధవ్ పోస్టర్లతో అలంకరిస్తున్నారు. మొత్తానికి స్ట్రెయిట్ స్టార్ హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. అలాంటి క్రేజ్ బన్నీ విషయంలోనూ కనిపిస్తోంది. మనం కూడా వేరే భాషల హీరోల్ని అభిమానిస్తాం కానీ.. మరీ ఈ స్థాయిలో హడావుడి చేయం. ఐతే బన్నీ తనకు తానుగా కాన్షియస్ ఎఫర్టేమీ పెట్టకుండా కేరళలో ఇంత క్రేజ్ సంపాదించుకోవడం గొప్ప విషయమే. బన్నీ తన సినిమాల్ని తెలుగుతో పాటు మలయాళంలోనూ ఒకేసారి రిలీజ్ చేయగలిగితే అతడి రేంజ్ మరింత పెరిగే అవకాశముంది.
Tags:    

Similar News