• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ట్యాక్సీవాలా' కోసం...

'ట్యాక్సీవాలా' కోసం మెగాహీరో

By - Tupaki Desk
Update: 2018-11-08 08:08 GMT
యూత్‌ లో మంచి క్రేజ్‌ ఉన్న విజయ్‌ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. పలు సార్లు వాయిదాలు పడ్డ ట్యాక్సీవాలా ఎట్టకేలకు ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను ఈనెల 11న చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హాజరు కాబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

ఈ చిత్రంను గీతా ఆర్ట్స్‌ 2 మరియు యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా మీడియం బడ్జెట్‌ తో నిర్మించాయి. ఈ చిత్రానికి అల్లు అర్జున్‌ వ్యక్తిగత పీఆర్‌ ఓ అయిన ఎస్‌ కే ఎన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా ఎస్‌ కే ఎన్‌ చిత్రాలను నిర్మించాడు. చిన్న బడ్జెట్‌ తో రూపొందిన ఆ చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. అందుకే ఈ చిత్రంపై కూడా నమ్మకం వ్యక్తం అవుతుంది. బన్నీ ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో హాజరు కాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం.

సైంటిఫిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో పాటు ప్రియాంక జువాల్కర్‌ - మాళవిక నాయర్‌ - కళ్యాణి - మధునందన్‌ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్‌ దేవరకొండకు వచ్చిన క్రేజ్‌ తో ‘ట్యాక్సీవాలా’ భారీ ఓపెనింగ్స్‌ ను దక్కించుకోవడం ఖాయంగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.
Tags:    
  • Allu Arjun 
  • Vijay Devarkonda 
  • Taxiwaala Movie PRe Release Event 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS