పుష్ప షూటింగ్ షురూ..మారేడుమిల్లికి చేరుకున్న అల్లు అర్జున్
క్లాస్ చిత్రాల దర్శకుడు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప మూవీని తెరక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ మూవీకి సంబంధించి ఇదివరకే అల్లు అర్జున్ లేకుండానే కొన్ని సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఎర్రచందనం స్మగ్లింగ్ కథా నేపథ్యంలో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ డ్రైవర్ గా ఓ మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా..కరోనా కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది. పుష్ప సన్నివేశాల చిత్రీకరణ కేరళలో చేసేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకోగా ఇప్పటి కరోనా పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు.
దీంతో తెలంగాణలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరిపేందుకు దర్శకుడు సుకుమార్ నిర్ణయించారు. దీనికోసం అటవీ ప్రాంతంలో కొన్ని సెట్స్ సిద్ధం చేశారు. చిత్రీకరణకు అంతా రెడీ కావడంతో శనివారం రాత్రి అల్లు అర్జున్ మారేడుమిల్లి చేరుకున్నారు. ఇక్కడి హెచ్‌ఎన్‌టీసీ ఫారమ్ వద్ద ఇటీవల నిర్మించిన 'ది ఉడ్స్' కాటేజీల్లో బస చేశారు. సౌకర్యాల కోసం ప్రత్యేకంగా ఓ బస్సునూ హైదరాబాద్ నుంచి తెప్పించారు. అటవీ ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి పుష్ప చిత్రీకరణ ప్రారంభించేందుకు టీం అన్ని సిద్ధం చేసింది. షూటింగ్ జరిగే ప్రాంతానికి ఎవరినీ అనుమతించడం లేదు.