బన్నీ - త్రివిక్రమ్ మూవీ.. స్టోరీ లైన్ - టైటిల్
అల్లు అర్జున్ హీరోగా గత సంవత్సరం వచ్చిన 'నా పేరు సూర్య' చిత్రం నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకుని తనకు గతంలో రెండు సక్సెస్ లు ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమాకు సిద్దం అయ్యాడు. ఈనెలలోనే వీరిద్దరి కాంబోలో మూవీ పట్టాలెక్కబోతుంది. మొదట ఒక బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా వీరిద్దరి కాంబో మూవీ ఉండబోతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ కథ కాదని సొంత కథతో త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు. కొత్త కథ అవ్వడం వల్లే ఆలస్యం అవుతుందని మెగా వర్గాల ద్వారా అనఫిషియల్ గా లీక్స్ వచ్చాయి. లేట్ గా వచ్చినా మరోసారి బన్నీ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ మెగా వర్గాల వారు చెబుతూ వస్తున్నారు.
ఎట్టకేలకు స్క్రిప్ట్ సిద్దం అయ్యిందని - ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుందని సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ చిత్రం స్టోరీ లైన్ అంటూ ఒక చిన్న లైన్ కూడా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న స్టోరీ లైన్ ఏంటీ అంటే.. హీరో ఒక అబద్దంను చెప్పాల్సి వస్తుందట. ఆ అబద్దం వల్ల విలన్ వద్ద చిక్కుకుంటాడు. విలన్ ను ఢీ కొట్టాల్సి వస్తుంది. చివరకు హీరో చెప్పిన అబద్దం నిజమే అని తెలుస్తుంది. ఈ చిన్న స్టోరీ లైన్ చుట్టు త్రివిక్రమ్ అత్యంత అందంగా స్క్రీన్ ప్లేను నడిపించాడని, ఆయన మార్క్ కామెడీ ఈ చిత్రంలో ఉంటుందని చెబుతున్నారు.
కథతో పాటు నేను నాన్న అనే టైటిల్ ను ఈ చిత్రంకు పరిశీలిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తోనే ఈ చిత్రం కూడా ఉంటుందని - సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో తండ్రికి అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తిగా హీరో పాత్ర ఉంటుందని, అందుకే ఈ చిత్రానికి నేను నాన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ రెండు పుకార్లలో నిజం ఎంతో చిత్ర యూనిట్ సభ్యులు నోరు తెరిస్తే కాని క్లారిటీ రాదు.