#నిహారిక పెళ్లి.. ప‌ర్ఫెక్ట్ బ్యూటిఫుల్ క‌పుల్

Update: 2020-12-10 05:30 GMT
కుంద‌న‌పు బొమ్మ నిహారిక‌ పెళ్లిలో ముచ్చ‌టైన జంట ఎవ‌రు?  పెళ్లిలో అతిథులు ప్రేక్ష‌క మ‌హాశ‌యుల దృష్టిని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించిన జంట ఎవ‌రు? కాంపిటీష‌న్ పెడితే ఎవ‌రికి ఎక్కువ ఓటింగ్ ఎవ‌రికి ద‌క్కుతుంది?  అంటే నిశ్శందేహంగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహ జంట‌కే అంద‌రి ఓటు. క్యూట్ ల‌వ్ లీ పెయిర్ గా పెళ్లి వేడుక ఆద్యంతం సంద‌డి చేసింది ఈ ల‌వ్ లీ జోడీనే.

కేవ‌లం మెగా కుటుంబం నుంచి 10 జంట‌లు పైగా ఈ వేడుక‌కు అటెండ్ కాగా.. అందులో సంథింగ్ స్పెష‌ల్ జంట‌గా అల్లు అర్జున్ - స్నేహ జంట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇక ఈ వేడుక‌లో డిజైన‌ర్ లుక్ లో క‌నిపించి స్పెల్ బౌండ్ చేసిన జంట కూడా వీరే.

బాగా పెరిగిన త‌ల‌క‌ట్టు.. గుబురుగా పెంచిన‌ గ‌డ్డంతో బ‌న్నీ ఎంత మాసీగా క‌నిపిస్తున్నాడో బ్యూటిఫుల్ స్మైల్ తో స్నేహ అంత క్లాసీగా క‌నిపిస్తున్నారు ఈ పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ ఫోటోలో. ఈ వేడుక ఆద్యంతం  ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించింది ఈ జంట‌.

పుష్ప సెట్స్ నుంచి నేరుగా పెళ్లికి అటెండ్ కావ‌డంతో బ‌న్ని గెట‌ప్ ఛేంజ్ చేయ‌లేక‌పోయాడు. పుష్ప చిత్రం‌లో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ గ్యాంగ్ లో డ్రైవ‌ర్ గా న‌టిస్తున్న బ‌న్నీ ఇలా మాస్ లుక్ కి షిఫ్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ఆ హెయిర్ స్టైల్ కూడా సంథింగ్ స్పెష‌ల్ గా పెళ్లిలో హైలైట్ అయ్యింది మ‌రి.
Tags:    

Similar News