• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా కొడుకులతో సమానం...

నా కొడుకులతో సమానం -అరవింద్

By - Tupaki Desk
Update: 2018-04-19 04:44 GMT
యూత్ హీరోల్లో మంచి ఫాంలో ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. చేసింది తక్కువ సినిమాలో అయినా యూత్ కు విపరీతంగా కనెక్టయ్యే క్యారెక్టర్లతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడు విజయ్ దేవరకొండ కాదు.. విజయ్ బంగారుకొండ అంటూ మెగా నిర్మాత అల్లు అరవింద్ కాంప్లిమెంట్ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అల్లు అరవింద్ కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు.

‘‘యూత్ ఐకాన్ మాటకు పర్ ఫెక్ట్ సూటయ్యే పర్సన్ విజయ్ దేవరకొండ. అతడు మాట్లాడితే జెన్యూన్ గా ఉంటుంది. అతడి ఫీలింగ్ జెన్యూన్ గా ఉంటుంది. మనిషి జెన్యూన్ గా ఉంటాడు. నా కొడుకులతో సమానమైన యాక్టర్’’ అంటూ అరవింద్ విజయ్ దేవరకొండను పబ్లిక్ మీటింగ్ లో తెగ మెచ్చుకున్నారు. ఈ సినిమా డైరెక్టర్ రాహుల్ కథ చెప్పిన వెంటనే ఇంప్రెస్ అయ్యానని.. ఇందులో తాను ఇన్వాల్స్ అయితే తన ఆలోచనలు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సినిమా షూటింగ్ అయ్యేంతవరకు దూరంగానే ఉన్నానని అరవింద్ చెప్పుకొచ్చారు. సినిమాలో తాను వేలు పెట్టకపోవడమే డైరెక్టర్ కు ఇచ్చిన పెద్ద కానుక అన్నారు.

డైరెక్టర్ రాహుల్ - విజయ్ దేవరకొండ వీరిద్దరే ఈ సినిమాకు సంబంధించి మొత్తం వ్యవహారాలు ముందుండి చూసుకున్నారని.. తాను ఇంకా సినిమా కూడా చూడలేదని.. తరవాతే చూస్తానని అరవింద్ క్లియర్ కట్ గా చెప్పారు. బాహుబలి సినిమాతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తెలుగు సినిమా స్థాయిని తగ్గించేలా కొంతమంది వ్యవహరిస్తున్నారంటూ చివరిలో అరవింద్ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. గీతా ఆర్ట్స్ 2- యువి క్రియేషన్స్ సంయుక్తంగా టాక్సీవాలా సినిమాను నిర్మించాయి.
Tags:    
  • Allu Aravind 
  • Vijay Devarakonda 
  • Taxiwaala Teaser Launch 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS