• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు అరవింద్ రూటే...

అల్లు అరవింద్ రూటే సెపరేటబ్బా..!

By - Tupaki Desk
Update: 2019-03-06 17:30 GMT
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు కానీ వాటిలో రెండు సినిమాలపై మాత్రం అందరి దృష్టి ఉంది.  అవే అక్కినేని హీరోలు నాగచైతన్య.. అఖిల్ తో సెట్ చేస్తున్న ప్రాజెక్టులు.   అఖిల్ నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అఖిల్ సినిమానే కాకుండా చైతుకోసం కూడా ఒక ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారు అరవింద్.

చిత్రమైన విషయం ఏంటంటే రెండు సినిమాలకు ఫ్లాప్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తుండడం.  అఖిల్ సినిమాకు 'బొమ్మరిల్లు' భాస్కర్ ను డైరెక్టర్ గా ఇప్పటికే లాక్ చేశారని టాక్.  ఇప్పుడు ఈ సినిమా కు ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందట. భాస్కర్ దాదాపుగా ఫేడ్ అవుట్ అయ్యాడు కానీ అరవింద్ గారికి మాత్రం భాస్కర్ టాలెంట్ పైన ఇప్పటికీ చాలా నమ్మకం ఉందట. ఫ్యామిలీ డ్రామాలను  భాస్కర్ చక్కగా హ్యాండిల్ చేస్తాడనే ఉద్దేశంతో అలాంటి సినిమానే అఖిల్ కోసం సెట్ చేస్తున్నారట.

ఇక చైతుతో చేయబోయే ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ దశరథ్ ను సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  'సంతోషం'.. 'Mr. పర్ఫెక్ట్' లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దశరథ్ ఇప్పుడు ఫామ్ లో లేడు.  కానీ రీసెంట్ గా దశరథ్ వినిపించిన కథ అరవింద్ గారికి నచ్చిందట.  దీంతో ఆయన చైతన్యను ఆ కథ వినమని కోరాడట. ఒకవేళ చైతు ఒప్పుకుంటే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయట.   చైతు కోసం 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పేరు కూడా మధ్యలో విన్పించింది కానీ అదేమీ ఫైనలైజ్ కాలేదట.  మంచి బ్రేక్ కోసం.. సాలిడ్ హిట్స్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని బ్రదర్స్ కోసం అల్లు అరవింద్ గారు ఇలా ఫ్లాప్ డైరెక్టర్లను సెట్ చేయడం వినడానికి వింతగానే ఉంది.  కాకపోతే అరవింద్ గారు మాస్టర్ బ్రెయిన్ అని అందరికీ తెలుసు..  ఎంతో అలోచించి కానీ ఇలాంటి కాంబినేషన్లు సెట్ చేయరు.  కథలో దమ్ముంటే తప్ప ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వరు.  చూద్దాం ఏం జరుగుతుందో.
    

Tags:    
  • Allu Aravind 
  • Akkineni Brothers 
  • Naga Chaitanya 
  • Akhil 
  • Telugu News 
  • latest Updates 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS