మన రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు

Update: 2015-07-11 09:11 GMT
బాహుబలి సినిమా గురించి, మన రాజమౌళి గురించి మనం ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ వేరే భాషల దర్శకులు, నటీనటులు మనోడి గురించి ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం. మరి కొందరు వేరే ఇండస్ట్రీల వాళ్లు మన దర్శక ధీరుడి గురించి ఏమంటున్నారో ఒక్కసారి చూడండి.

''ఇండియన్‌ సినిమా 'బాహుబలి అనంతర శకం'లోకి ప్రవేశించింది. మన సాహసోపేత కలల దర్శకుడు రాజమౌళికి నా సెల్యూట్‌''

-హీరో సిద్దార్థ్‌

''బాహుబలి లాంటి సినిమా మనందరికీ గర్వకారణం. ఓ భారతీయ దర్శకుడు ఇలాంటి కల కనడానికి సాహసించడం గొప్ప విషయం. ఈ సినిమాతో మనం ఓ గొప్ప ముందడుగు వేశాం''

-తరణ్‌ ఆదర్శ్‌, బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు

''నార్త్‌ ఇండియా వాళ్లతో పోలిస్తే సౌత్‌ డైరెక్టర్స్‌ ఎంతో సాహసోపేతమైన సినిమాలు తీస్తున్నారు. ముంబయిలో రాజమౌళి లాంటి ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారా?''

-శేఖర్‌ కపూర్‌, హాలీవుడ్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన ఇండియన్‌ డైరెక్టర్‌

''హాలీవుడ్‌ లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌కు ఇండియన్‌ ఆన్సర్‌ బాహుబలి. ఇలాంటి సినిమాను అందించినందుకు రాజమౌళికి, కరణ్‌ జోహార్‌కు థ్యాంక్స్‌''

-సంజయ్‌ ఖండూరి, బాలీవుడ్‌ దర్శకుడు

''ఇండియన్‌ డైరెక్టర్లందరికీ రాజమౌళి బాప్‌. బాహుబలి లాంటి మాస్టర్‌ పీస్‌లో భాగం కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా''

-కరణ్‌ జోహార్‌

''వీఎఫ్‌ఎక్స్‌ను సినిమా కోసం ఎలా వాడుకోవాలో తెలుసుకోవడానికి తన డైరెక్టర్లందరినీ హైదరాబాద్‌లో రాజమౌళి దగ్గరికి పంపిస్తాడు''

-బాలీవుడ్‌ క్రిటిక్‌ రాజీవ్‌ మసంద్‌

Tags:    

Similar News