ప్రభాస్ తో జోడీకి ఆలియా సై

Update: 2017-05-15 04:46 GMT
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ఆలియా భట్ బాగా ఓపెన్. అడగాలే గానీ అమ్మడి నోటిలో ఒక్క విషయం కూడా దాగదు. ప్రశ్న ఎదురవగానే ఠకీమని తన మనసులో ఉన్న ఆన్సర్ చెప్పేసే టైపు. ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా ఇలాంటి ఆన్సర్ నే ఇచ్చి ఆశ్చర్యపరిచింది ఆలియా భట్.

తాజాగా తన ట్విట్టర్ ఫాలోయర్స్ తో ఛాట్ చేసింది ఆలియా భట్. అందులో భాగంగా ఈమెకు బాహుబలి2 అండ్ ప్రభాస్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. బాహుబలి  గురించి చెప్పమని అడిగినపుడు.. 'ఈ దిగ్గజ మూవీ కోసం ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి. రాక్-బస్టర్ అనచ్చు. నాకు బాగా నచ్చింది. ఇదో అద్భుతం' అంటూ పొగిడేసింది ఆలియా. ఇక సౌత్ లో ఫేవరేట్ యాక్టర్ అంటే మాత్రం.. తడుముకోకుండా ప్రభాస్ అనే ఆన్సర్ ఇచ్చేసింది కూడా. ప్రభాస్ తో నటించే ఆఫర్ వస్తే చేస్తారా అని అగినపుడు.. తప్పకుండా.. ఎలాంటి పరిస్థితులలోనూ అవకాశం వదులుకోనని ఆలియా భట్ చెప్పడం విశేషం.

ప్రస్తుతం రణబీర్ కపూర్ తో డ్రాగన్ మూవీతో పాటు.. గల్లీ బోయ్ అనే మూవీలో నటిస్తోంది ఆలియా. అది సరే కానీ.. సాహో చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీని తెస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఆలియా భట్ లాంటి యంగ్ హీరోయిన్.. అడగక ముందే సరే అనేస్తోంది. ఇటు నుంచి నరుక్కొస్తే పని తేలిగ్గా అవుతుందేమో!
Tags:    

Similar News