• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆరేళ్ల తర్వాత పెళ్లి.....

ఆరేళ్ల తర్వాత పెళ్లి.. అప్పుడే పిల్లల పేర్లు రెడీ

By - Tupaki Desk
Update: 2018-05-21 15:50 GMT
చిన్న వయసులోనే హీరోయిన్‌గా అరంగేట్రం చేసి మంచి పేరు సంపాదించింది మహేష్ భట్ తనయురాలు ఆలియా భట్. జీకే విషయంలో వీక్ కానీ.. నటన విషయంలో మాత్రం ఆలియాకు తిరుగులేదు. ‘హైవే’.. ‘2 స్టేట్స్’. ‘ఉడ్తా పంజాబ్’ లాంటి సినిమాలు చాలు ఆలియా టాలెంట్ ఏంటో చెప్పడానికి. ఇటీవలే ‘రాజి’తో మరోసారి తనేంటో రుజువు చేసిందామె. ఈ చిత్రంలో ఆలియా నటనకు జనాలు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం భారీ విజయం కూడా సాధించి ఆలియా ఇమేజ్‌ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆలియా వయసు 24 ఏళ్లు మాత్రమే కావడం విశేషం. ఈ వయసులోనే ఇంత సక్సెస్ సాధించిన ఆమెను పెళ్లి గురించి అడిగితే.. దానికింకా చాలా సమయం ఉందని చెప్పింది. 30 ఏళ్ల తర్వాతే పెళ్లాడతానని చెప్పింది.

ఐతే పెళ్లి విషయంలో తనకు చాలా కలలు ఉన్నాయన్న ఆలియా.. తనకు పుట్టబోయే పిల్లల కోసం ఇప్పటికే పేర్లు కూడా రెడీ చేసినట్లు చెప్పింది. ఇప్పటికే తాను మూడు పేర్లు అనుకుంటున్నట్లు చెప్పింది. తనకు ఎక్కడైనా ఒక కొత్త పేరు కనిపిస్తే వెంటనే దాన్ని నోట్ చేసుకుంటానని.. తన పిల్లలకు పెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుందని ఆలియా చెప్పింది. ఇలా పేర్లన్నీ పోగేసి.. పిల్లలు పుట్టే సమయానికి ఏవి బాగుంటే అవి పెట్టుకుంటానని ఆలియా చెప్పింది. బయటి వాళ్లు తననెలా చూసినా.. ఇంట్లో వాళ్లు మాత్రం తననెప్పుడూ చిన్న పిల్లలా చూడలేదని.. సినీ పరిశ్రమలో ఉన్నాను కాబట్టి తాను ఎప్పుడూ పెద్ద పెద్ద వాళ్లతో స్నేహం చేయాల్సి ఉంటుందని.. ఆ రకంగా తాను మానసికంగా చాలా ఎదిగానని ఆలియా చెప్పింది. ప్రస్తుతానికి తన మనసంతా సినిమాల మీదే ఉందని.. పెళ్లి గురించి ఇప్పుడేమీ ఆలోచించట్లేదని అంది ఆలియా.
Tags:    
  • Alia Bhatt 
  • Baby names 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS