ష్‌..! రణబీర్ మాజీలు పెళ్లికి అటెండ‌వుతార‌ట‌!

Update: 2022-04-08 00:30 GMT
దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రణబీర్ కపూర్ ఒకడు. ఎట్టకేలకు అత‌డు బ్యాచిల‌ర్ షిప్ ని వ‌దిలి సంసార సాగ‌రంలోకి అడుగుపెడుతున్నాడు. సుదీర్ఘ కాలంగా ప్రేమ‌లో ఉన్న అత‌డు త‌న ప్రేయ‌సి ని మ‌నువాడుతున్నాడు. ఈ నెల 17న ప్రియురాలు అలియా భట్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

అయితే ఆలియా కంటే ముందు రణబీర్ క‌పూర్ ప్రేమాయ‌ణాల గురించి తెలిసిందే. అంత‌కుముందు దీపికా పదుకొనేతో డేటింగ్ చేశాడు. అదే స‌మ‌యంలో కత్రినా కైఫ్ తో కూడా లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అతని మాజీలు కత్రినా- దీపిక ల‌కు ఇప్ప‌టికే పెళ్ల‌యిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌రూ ర‌ణ‌బీర్ పెళ్లికి వ‌స్తున్నారా?  లేదా? అంటే అటెండ‌య్యేందుకే సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఆ  ఇద్దరూ తమ తమ భర్తలతో కలిసి రణబీర్ వివాహానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని క‌థ‌నాలొస్తున్నాయి.

ముంబైలోని ప్రముఖ ఆర్కే బంగ్లాలో  ఈ పెళ్లి జరగనుంది. ఇండస్ట్రీ నుండి దగ్గరి బంధువులు .. స్నేహితులను మాత్రమే ఈ జంట ఆహ్వానించారు. ఈ నెలాఖరున రిసెప్షన్‌ జరగనుంది. ఇందులో ఇండ‌స్ట్రీ స్నేహితులంతా పాల్గొంటారు. మొత్తానికి మాజీలు పెళ్లిలో క‌నిపిస్తే ర‌ణ‌బీర్ మూడ్ ఎలా మారుతుందోన‌న్న టెన్ష‌న్ అయితే ఇప్ప‌టికి అక్క‌ర్లేదు.
Tags:    

Similar News