• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రేజీ మూవీ రిలీజ్ డేట్...

క్రేజీ మూవీ రిలీజ్ డేట్ లాక్‌

By - Tupaki Desk
Update: 2021-09-30 12:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రథాన పాత్రలో తెరకెక్కిన 'గంగూభాయ్‌' పై అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం ఉత్తరాది ప్రేక్షకులు మాత్రమే కాకుండా దక్షిణాదిన కూడా ఈ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ఆలియా భట్ ఈ సినిమా లో తన నట విశ్వరూపం చూపించినట్లుగా ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు గ్లింమ్స్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పింది. ఈ సినిమా విడుదల విషయంలో గత కొన్నాళ్లుగా నెలకొని ఉన్న సస్పెన్స్‌ క్లీయర్ అయ్యింది. కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా ను ఎట్టకేలకు విడుదల చేసేందుకు గాను కొత్త తేదీని ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 6వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఆలియా భట్ ప్రథాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అజయ్‌ దేవగన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా షూటింగ్‌ దశలో ఉన్నప్పుడే ఈ సినిమా గురించిన కథనాలు బాలీవుడ్‌ మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈసినిమాను దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమాలు ను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. కాని మేకర్స్ ఈ సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయాలనే పట్టుదలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది.

టాలీవుడ్ లో ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని.. లేదంటే జనవరి 26న విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయం పై అతి త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆర్ ఆర్‌ ఆర్‌ కూడా జనవరిలోనే వస్తే ఆలియా భట్ రెండు భారీ చిత్రాలు ఒకే నెలలో విడుదల చేసిన ఘనత దక్కించుకుంటుంది. రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఆమెను నటిగా ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    
  • Alia Bhatt 
  • Gangubai Kathiawadi 
  • Release 
  • 6th Jan 2022 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS