అక్క కూతురు పెళ్లికి అన్నీ తానే అయిన అలీ!

Update: 2020-12-10 06:00 GMT
టాలీవుడ్ లో వ‌రుస పెళ్లిల్లు సామాన్యుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవ‌ల నిఖిల్ - నితిన్ - రానా పెళ్లి బంధంతో ఓ ఇంటివాళ్ల‌య్యారు. మెగా ప్రిన్సెస్ నిమారిక డెస్టినేష‌న్ వివాహం ఈ బుధ‌వారం సాయంత్రం రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో క‌న్నుల పండుగ‌ను త‌ల‌పించింది. మ‌రోవైపు నందమూరి ఇంట కూడా పెళ్లి సందడి మొదలైంది. ఆ కుటుంబానికి చెందిన నందమూరి కృష్ణ చైతన్య నిశ్చితార్థం రెండు రోజుల క్రితం ఘనంగా జరిగింది.

తాజాగా మ‌రో వివాహానికి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. క‌మెడియ‌న్ అలీ పెద్దక్క కూతురు సల్మా వివాహం సోమవారం రాత్రి రాజమండ్రిలో జరిగింది.

సల్మా- అహ్మద్‌ అలీ పెళ్లి  వేడుకలో రాజమండ్రి ఎంపీ మర్గాని  భరత్‌ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సల్మాకు తండ్రి లేకపోవటంతో మేనమామ అలీ ఆ బాధ్య‌త‌ను తీసుకుని పెళ్లి వేడుకని అంగరంగా వైభవంగా జరిపారు. అలీ ప్ర‌స్తుతం య‌మ‌లీల‌కు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న టీవీ సీరియ‌ల్ లో న‌టిస్తున్నారు. ఎస్వీ కృష్ణా రెడ్డి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే వైయ‌స్సార్ కాంగ్రెస్ లో చేరి రాజ‌కీయాల్లోనూ అలీ ఉన్నారు.
Tags:    

Similar News