అసలు నిర్మాత కు నష్టాలు.. కొసరు నిర్మాత కు లాభాలు!

Update: 2020-01-29 04:16 GMT
ఉప్పు.. కర్పూరం ఒకే రకంగా కనిపిస్తాయి కానీ రెండూ వేరే అని వేమన ఎప్పుడో చెప్పాడు. అన్నీ సినిమాలను హిట్లుగా చెప్పుకుంటారు.. సౌండ్ ఎక్కువ వచ్చేలా డప్పు కూడా కొట్టుకుంటారు కానీ అసలు హిట్టు ఏదో లేటుగా అయినా జనాలకు అర్థం అయిపోతుంది.. ఇదిలా ఉంటే ఈమధ్య రిలీజ్ అయిన ఒక స్టార్ హీరో సినిమా లాభాల వ్యవహారం పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు అసలు నిర్మాతకు నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. దీనికి ఒక కారణం.. రెమ్యూనరేషన్ పేరిట హీరో వీలైనంతగా రాబట్టుకున్నాడట. మరో ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు కానీ ఆయన ముందే జాగ్రత్త పడ్డారట. హీరోతో గతంలో ఇలాంటి అనుభవమే ఉండడం తో ఈ సినిమా కు తెలివిగా రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా నెట్టుకొచ్చారట. అయితే పంపిణీ చేతిలో ఉండడంతో లాభాలు వచ్చాయట. నిజానికి ఈ సినిమా తో హీరో తర్వాత ఎక్కువ లాభ పడింది ఈయనేనట. ఎలా అంటే బైట వారికి అమ్మే రేట్లు ఒక రకంగా ఉంటే ఇతనికి మాత్రం తక్కువలోనే వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ ప్రాజెక్టు లాభసాటిగా మారిందట.

అయితే అసలు నిర్మాతకు మాత్రం ఈ సినిమానే చివరి సినిమా అయ్యేలా ఉందని కూడా ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం ఈ సినిమానే చివరి సినిమా అని ఫ్లోలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అది నిజమయ్యేలా ఉందని అంటున్నారు.
Tags:    

Similar News