ట్రైలర్ టాక్: త‌్రివిక్రమ్ మార్కులో ఉంది కానీ!
మిడిల్ క్లాస్ కష్టాలు సుఖాలు దుఃఖాలు .. వీటన్నిటికీ తోడు నీతి నియమాలు విలువలు అంటూ కొంత క్లాస్ గా వెళుతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. బన్ని లాంటి మాస్ యాక్షన్ హీరోతో కుటుంబ కథల్ని వండుతున్నాడు. ఇంతకుముందు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రానికి డివైడ్ టాక్ రావడానికి ఈ క్లాస్ అప్పీలే కారణం. అయితే మరోసారి అలాంటి సీనే ఉంటుందా? అంటే అల వైకుంఠపురములో ట్రైలర్ చూడగానే కలిగిన ఫీలింగ్ కూడా సేమ్.
మరోసారి త్రివిక్రమ్ తనదైన వేలో క్లాసీగానే వెళుతున్నాడా? మాస్ కి కాస్త దూరంగానే వెళుతున్నాడా? అన్న సందేహం కలగజేసేలా క్లాసీ ట్రైలర్ తో వచ్చాడు మరి. అల వైకుంఠపురములో మిడిల్ క్లాస్ స్ట్రగ్లింగ్ కుర్రాడి కథే. చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ఆహా అనుకునే ఒక్క రోజు కూడా లేదు!! ఇది రియాలిటీ .. ఆల్మోస్ట్ యూత్ కి ఎదురయ్యే రియాలిటీ లైన్ తీస్కున్న త్రివిక్రమ్ దానికి కార్పొరెట్ బ్యాక్ డ్రాప్.. సాఫ్ట్ వేర్ నేపథ్యం.. భారీ బిల్డింగులతో పెద్ద కుటుంబాలతో లంకె వేసాడు. ఇక ఇందులో టబు లాంటి సీనియర్ తో మురళి శర్మ లాంటి డాడీతో.. జయరాం- సుశాంత్ లాంటి క్లాసీ మనుషులతో బన్నీకి ఏంటి? అన్నది తెరపై చూడాలి. ఇంతకీ అల మ్యాడమ్ తో బన్నీ రొమాన్స్ ఏమిటన్నిది ట్రైలర్ లో ఎలివేట్ చేశారు.
అంతా బాగానే ఉంది కానీ సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ తర్వాత అల వైకుంఠపురములో ట్రైలర్ వచ్చింది కాబట్టి అభిమానుల్లో చిన్న పోలిక కూడా చూస్తుంటారు. అలా చూస్తే అల ట్రైలర్ కాస్త చిన్న బుచ్చుకుందా? అనిపించక మానదు. సరిలేరు ట్రైలర్ తో పోలిస్తే సగటు అభిమానికి వన్ సైడెడ్ గా ఒక మెట్టు తక్కువే అనిపిస్తోంది. అందులో మసాలా ఎలిమెంట్స్ కామెడీ బాగా దట్టించారు. దాంతో పోలిస్తే టింజ్ కాస్త అల వైకుంఠపురములో ట్రైలర్ కి తక్కువే. త్రివిక్రమ్ మార్క్ లో ఉంది కానీ .. ఏమిటో చూడాలి! అన్నట్టుగానే తేలిపోయింది మరి. జనవరి 12న తేదీని బన్ని టీమ్ మార్క్ చేసుకున్నారు. రిజల్ట్ ఆరోజే తేలాల్సి ఉంది. మహేష్ తో బన్నికి ఠఫ్ కాంపిటీషన్ తప్పదు. మరి ఎవరి సత్తా ఎంతో!
Full View