• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈయనే బాలీవుడ్‌ కొత్త...

ఈయనే బాలీవుడ్‌ కొత్త బాద్‌ షా

By - Tupaki Desk
Update: 2019-07-12 10:54 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అనగానే ఖాన్స్‌ త్రయం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాతే అజయ్‌ దేవగన్‌.. అక్షయ్‌ కుమార్‌ ల పేర్లు ప్రస్తావనకు వచ్చేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు బాలీవుడ్‌ బాద్‌ షా గా గుర్తింపు దక్కించుకున్న షారుఖ్‌ ఖాన్‌ చాలా కాలంగా సరైన సక్సెస్‌ లేకపోవడంతో ఢీలా పడిపోయాడు. ఇక సల్మాన్‌ ఖాన్‌ రెగ్యులర్‌ గా సినిమాలు చేస్తూ ఉన్నా కూడా అడపా దడపా మాత్రమే సక్సెస్‌ లు వస్తున్నాయి. ఇక అమీర్‌ ఖాన్‌ చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వరుసగా చిత్రాలు చేస్తు విజయాలను దక్కించుకుంటున్న అక్షయ్‌ కుమార్‌ బాలీవుడ్‌ బాద్‌ షా అయ్యాడు.

అక్షయ్‌ కుమార్‌ బాలీవుడ్‌ బాద్‌ షా అంటూ ఏకంగా ఫోర్బ్స్‌ సంస్థ ప్రకటించింది. బాలీవుడ్‌ సెలబ్రెటీల్లో గత ఏడాది అత్యధికంగా సంపాదించిన హీరో అక్షయ్‌ కుమార్‌ అని ఫోర్బ్స్‌ వెళ్లడించింది. గత ఏడాది ఏకంగా 444 కోట్ల రూపాయలను అక్షయ్‌ కుమార్‌ సంపాదించినట్లుగా పేర్కొన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ లు యాడ్స్‌ ఇంకా పలు మార్గాల ద్వారా అక్షయ్‌ కుమార్‌ ఈ మొత్తంను సంపాదించినట్లుగా పోర్బ్స్‌ వెళ్లడించింది.

బాలీవుడ్‌ కు చెందిన ఇంత మంది స్టార్స్‌ ఉండగా అక్షయ్‌ కుమార్‌ నెం.1 స్థానంలో నిలవడంతో ఇకపై బాలీవుడ్‌ బాద్‌ షా అంటూ అక్షయ్‌ కుమార్‌ ను పిలవాల్సిందే అంటూ ఆయన అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. తన ప్రతి సినిమాకు పారితోషికంతో పాటు లాభాల్లో వాటాను తీసుకుంటూ ఉండటం వల్ల దాదాపు 50 కోట్లను దక్కించుకున్న అక్షయ్‌ కుమార్‌ దాదాపు టాప్‌ 20 బ్రాండ్స్‌ కు అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రముఖ వెబ్‌ స్ట్రీమింగ్‌ సంస్థతో భారీ మొత్తానికి అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాడు. ఆ కారణంగా గత ఏడాది బాలీవుడ్‌ బాద్‌ షా అక్షయ్‌ అయ్యాడు.
Tags:    
  • Akshay Kumar 
  • Forbes List 
  • Telugu News 
  • Latest News 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS