సమంతను కాకా పడుతున్న దర్శకురాలు

Update: 2020-03-06 23:30 GMT
అలా మొదలైంది అంటూ దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి మద్యలో నిరాశ పర్చినా గత ఏడాది ‘ఓబేబీ’ చిత్రంతో హిట్‌ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈమె తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. రెండు నెలల క్రితం ఈమె మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈమె చెప్పిన స్టోరీ లైన్‌ కు ఇంప్రెస్‌ అయిన మెగా కాంపౌండ్‌ వైష్ణవ్‌ తేజ్‌ సినిమాకు ఛాన్స్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.

స్క్రిప్ట్‌ తో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ ను నందిని రెడ్డి మెప్పించలేక పోయిందట. స్క్రిప్ట్‌ లో మళ్లీ మార్పులు చేర్పులు సూచించడంతో వైష్ణవ్‌ తేజ్‌ తో కాకుండా అక్కినేని హీరో నాగ చైతన్య తో చేయాలనే ఆలోచనకు నందిని రెడ్డి వచ్చిందని సమాచారం అందుతోంది. ఇప్పటికే సమంతతో తనకున్న సన్నిహిత్యంతో నాగచైతన్యను కలిసి స్టోరీ కూడా చెప్పిందట. మెగా కాంపౌండ్‌ నుండి వచ్చిన ఆ స్క్రిప్ట్‌ కు నాగ చైతన్య కూడా దాదాపుగా ఓకే చెప్పినట్లే అంటూ ఇండస్ట్రీ లో టాక్‌ వినిపిస్తుంది.

నాగచైతన్యతో సినిమాకు ఓకే చెప్పించేందుకు ప్రస్తుతం సమంతనును నందిని రెడ్డి కాకా పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నందిని రెడ్డి అలా మొదలైంది వంటి ఒక విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని చైతూ తో చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈమె ప్లాన్స్‌ ఏమేరకు వర్కౌట్‌ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News