సిక్స్ ప్యాక్ ఇలా చూపించేస్తే ఎలా అఖిల్?
ఈ రోజుల్లో ఏ యువ కథానాయకుడు కూడా లుక్ విషయంలో రాజీ పడట్లేదు. ఏమాత్రం బాడీలో తేడా వచ్చినా ప్రేక్షకులు అంగీకరించట్లేదు. సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగిపోతోంది. అందుకే ప్రతి హీరో కూడా ఫిట్ గా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. కండలు తిరిగి.. యాబ్స్ కూడా మంచి షేపులో ఉండేలా చూసుకుంటున్నారు. చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేస్తున్నారు. ఐతే అలాంటి లుక్ లోకి మారినపుడు దాన్ని సీక్రెట్ గా ఉంచి.. ఫస్ట్ లుక్ రూపంలోనో.. లేదంటే నేరుగా సినిమాలోనో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్ యాబ్స్ చూపించిన సంగతి తెలిసిందే.
ఐతే అక్కినేని కుర్రాడు అఖిల్ కూడా ఇప్పుడు సిక్స్ ప్యాక్ జాబితాలో చేరాడు. కానీ అతను తన లుక్ ను ఫస్ట్ లుక్ కోసమో.. సినిమా కోసమో దాచుకోలేదు. నేరుగా సోషల్ మీడియాలో తన యాబ్స్ చూపించేశాడు. షర్టు పైకెత్తి తానెంత ఫిట్ గా తయారయ్యానో అభిమానులకు చూపించాడు అఖిల్. పూర్తి స్థాయి సిక్స్ ప్యాక్ లుక్ రాలేదు కానీ.. దానికి చాలా దగ్గరగానే ఉన్నాడతను. బేసిగ్గా తాను భోజన ప్రియుడినని.. కానీ సినిమాల్లో ఉంటూ ఏది పడితే అది తింటే కష్టమని.. కాబట్టి జాగ్రత్త పడుతున్నానని.. సరైన తిండి.. సరైన మోతాదులో తింటున్నానని.. కనీసం ఒక సినిమా చేస్తున్న సమయంలో అయినా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ తప్పవని అతను చెప్పాడు. అఖిల్ ఇంత ఫిట్ గా తయారైంది వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసమే అన్నది తెలిసిందే. వెంకీతో ‘తొలి ప్రేమ’ నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాదే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ‘సవ్యసాచి’ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇందులో అఖిల్ కు జోడీగా నటిస్తోంది.