డిఫరెంట్ అని ప్రూవ్ చేసిన అఖిల్!

Update: 2018-11-01 13:00 GMT
సహజంగా స్టార్ కిడ్స్ లో ఎవరినైనా మీ ఫేవరేట్ స్టార్ ఎవరు అని అడిగితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక హీరో పేరు చెప్తారు.  ఫేవరేట్ సినిమా ఏదంటే అది కూడా అది వాళ్ళ ఫ్యామిలీ కి సంబంధించిన సినిమానే అయి ఉంటుంది.  ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రత్యేకంగా ఎగ్జాంపుల్స్ అవసరం లేదు.  కానీ అక్కినేని హీరో అఖిల్ మాత్రం తను డిఫరెంట్ అని ప్రూవ్ చేశాడు.

తన మొదటి సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఫేవరేట్ హీరోలు ఎవరంటే తాతగారు.. నాన్నగారు... అన్నగారు అని వారి పేర్లు చెప్పకుండా చిరంజీవి.. మహేష్ బాబుల పేర్లు చెప్పాడు.  ఇక తాజాగా అఖిల్ ఫేవరెట్ సినిమా ఏంటో తెలిసిపోయింది. అది కూడా అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమా కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'అత్తారింటికి దారేది'.  దీన్ని బట్టి అఖిల్ నిజంగానే డిఫరెంట్ అని అర్థం అయిపొయింది కదా.

ఇదిలా ఉంటే అఖిల్ తాజా చిత్రం 'Mr. మజ్ను' లోని కొన్ని సీన్స్ 'అత్తారింటి దారేది' సినిమా నుండి ఇన్ స్పిరేషన్ గా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.  ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు 'ఏ జవానీ హై దీవాని' సినిమా నుండి ఇన్ స్పిరేషన్ అన్నారు.. మరో సారి ఇంకో బాలీవుడ్ సినిమా పేరు చెప్పారు. ఏంటో ఈ గోల.  సినిమా రిలీజ్ అయితే గానీ మనకు క్లారిటీ రాదు!
Tags:    

Similar News