• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాటతో అఖిల్...

పాటతో అఖిల్ అదరగొట్టాడుగా..

By - Tupaki Desk
Update: 2017-07-01 08:54 GMT
నాగార్జున కొడుకు అఖిల్ కు సినిమాల్లోకి రాకముందు నుంచే అతడికి అభిమానులున్నారు. సిసింద్రీగా పసి వయసులోనే అందరినీ ఆకట్టుకున్న అతడిని ఇండస్ట్రీ మొదటి నుంచి కాబోయే హీరోగానే చూసింది. చూడటానికి బావుంటాడు కాబట్టి హీరోగా కచ్చితంగా షైన్ అవతాడని అంతా అనుకున్నారు. అక్కినేని అభిమానులంతా ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ డెబ్యూ ఫిలిం అఖిల్ సినిమా వారిని ఎంతో నిరాశపరిచింది.

లాంచింగ్ సినిమా నిరాశపరిచినా అఖిల్ టాలెంట్ ను తక్కువ అంచనా వేయడానికేం లేదు.  సినీ తారల క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడలా అఖిల్ స్టార్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతడిలో ఇంకో టాలెంట్ కూడా ఉందన్న విషయం రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది.  సైమా 2017 అవార్డ్స్ ఫంక్షన్ వేదికపై తన పాటతో అందరినీ కట్టిపడేశాడు. సాధారణంగా ఇలాంటి వేదికలపై హీరోలంతా డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో అదరగొట్టేస్తారు. స్టేజ్ పై సింగర్ గా మెప్పించడం అంత ఈజీకాదు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తన రాబోయే సినిమాలో ‘ఏవేవో కలలు కన్నా’ పాటను అఖిల్ పాడాడు. ఈ పాట విన్నవారంతా అఖిల్ ను మెచ్చుకోవడమే కాదు ప్లేబాక్ సింగర్ గా కూడా చక్కగా రాణిస్తాడని చెప్పారు.

విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ చేస్తున్న అఖిల్ రెండో సినిమాకు నాగార్జునే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. సింగర్ గా మంచి మార్కులే పడ్డాయి కాబట్టి రాబోయే సినిమాల్లో సొంతంగా పాట పాడటానికి అఖిల్ ట్రై చేయొచ్చు. నాగార్జున, విక్రమ్ కె.కుమార్ మనసు పెడితే ఈ సినిమాతోనే గొంతు సవరించుకోవచ్చు. చూద్దాం..

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Akhil Akkineni 
  • Song Performance 
  • SIIMA Awards 2017 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS