వెబ్ సిరీస్ ఆఫ‌ర్ అక్కినేని బుల్లోడికి ఓకేనా?

Update: 2020-07-30 08:30 GMT
అక్కినేని చియాన్ అఖిల్ న‌టించిన తొలి మూడు సినిమాలు ఆశించిన రిజ‌ల్ట్ ని ఇవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. అఖిల్ - హ‌లో- మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద‌ నిరాశ‌ప‌రిచాయి. అయితే డ్యాన్సులు ఫైట్స్ స‌హా న‌ట‌న ప‌రంగా అఖిల్ హార్డ్ వ‌ర్క్ ని ఇండ‌స్ట్రీ స‌హా అభిమానులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఈ న‌ట‌వార‌సుడు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు.

2015 నుంచి కెరీర్ గురించి పోరాటం చేస్తున్నా ఆశించిన‌ది ద‌క్క‌లేదు. ఆ క్ర‌మంలోనే తాజా సినిమాపైనే అఖిల్ ఆశ‌ల‌న్నీ. నాలుగ‌వ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ త‌న‌కు హిట్టిస్తుంద‌నే ఆశిస్తున్నాడు. అన్నీ కుదిరితే ఈ చిత్రం ఈపాటికే రిలీజ‌య్యేదే. కానీ మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు 2021 సంక్రాంతి విడుదలకు రానుంద‌ని తెలుస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. అఖిల్ సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ లో న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని  తెలుస్తోంది. ఓ  క్రేజీ హిందీ వెబ్ సిరీస్ ‌లో కీలక పాత్ర కోసం మేక‌ర్స్‌ అఖిల్‌ను సంప్రదించారట‌. ఈ సిరీస్ ‌లో రాక్‌స్టార్ పాత్రను ఆఫ‌ర్ చేశార‌ట‌. అయితే అఖిల్ దీనికి అంగీక‌రించాడా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

మ‌హ‌మ్మారీ రూల్స్ ని మార్చేసింది. పెద్ద తెర బుల్లితెర అంత‌రం చెరిపేసింది. అలాగే మునుముందు స్టార్ హీరోల ఫేట్ ని కూడా మార్చేయ‌బోతోంది. అగ్ర క‌థానాయ‌కులు అయినా డిజిట‌ల్ ప్ర‌పంచం వైపు ఓటీటీ వైపు చూడాల్సిన ప‌రిస్థితి మునుముందు క‌నిపించ‌నుంది. ఇలాంటి టైమ్ లో అఖిల్ ఈ ఆఫ‌ర్ ని ఓకే చేస్తున్నాడా లేదా? అన్న‌ది చూడాలి. మ‌రోవైపు అక్కినేని కోడ‌లు స‌మంత `ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2`లో కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌త తెలిసిందే. త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Tags:    

Similar News