రెండో రోజుకి ఘోరంగా ఏజెంట్ కలెక్షన్స్

Update: 2023-04-30 13:00 GMT
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు పర్వాలేదని స్థాయిలోనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ఏకంగా 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే రెండో రోజుకి మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాలలో కేవలం 67 లక్షలు మాత్రమే రెండో రోజు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాపై జనంలోకి ఎంతగా నెగిటివ్ టాక్ వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. మినిమమ్ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా వీకెండ్ లో రెండు రోజులు ఓ మోస్తారులో కలెక్షన్స్ రాబడతాయి.

అయితే ఏజెంట్ మూవీ శనివారం కంప్లీట్ గా డ్రాప్ రేట్ చూపించింది. దీనిని బట్టి ఈ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్ధం చేసుకోవచ్చు. ఏఒక్క యాంగిల్ లో కూడా ఆడియన్స్ నుంచి ఏజెంట్ మూవీపై పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. రెండో రోజు కలెక్షన్స్ చూసుకుంటే

నైజాంలో : 21 లక్షలు

సీడెడ్ లో: 8 లక్షలు

యూఏఈలో: 11 లక్షలు

తూర్పు గోదావరిలో: 7 లక్షలు

పశ్చిమ గోదావరిలో: 5 లక్షలు

గుంటూరులో: 7 లక్షలు

కృష్ణా జిల్లాలో: 5 లక్షలు

నెల్లూరు: 3 లక్షలు

మాత్రమే వచ్చాయి. ఓవరాల్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో 1.30 కోట్ల గ్రాస్ వస్తే అందులో 67 లక్షల షేర్ మాత్రమే ఉంది. రెండు రోజుల్లో కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 34 లక్షలు, ఓవర్సీస్ మార్కెట్ లో 75 లక్షల షేర్ వచ్చింది. టోటల్ గా 10.50 కోట్ల గ్రాస్ లో 5.76 కోట్ల షేర్ ని ఏజెంట్ చిత్రం సాధించడం విశేషం.

మొత్తానికి రెండో రోజుకే ఏజెంట్ మూవీ కలెక్షన్స్ మొదటి దారుణంగా పడిపోయాయి. మరి ఈ సినిమా ద్వారా నిర్మాత ఏ స్థాయిలో నష్టాలు చూడాల్సి వస్తుందనేది త్వరలో తెలిసిపోతుంది. ఏజెంట్ చిత్రంపై 36.20 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 37 కోట్ల వరకు రావాలి. ఇక క్లీన్ హిట్ కావాలంటే 31.24 కోట్ల మేరకు ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి దీనిని అందుకోవడం హైలీ ఇంపాజిబుల్ అని చెప్పాలి.

Similar News