• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆహా ఇండియన్ ఐడల్ కు అఖండ...

ఆహా ఇండియన్ ఐడల్ కు అఖండ సపోర్ట్

By - Tupaki Desk
Update: 2022-01-13 09:32 GMT
ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ.. ప్రేక్షకాదరణ కలిగిన మ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్. ఈ మ్యూజిక్ కాంపిటీషన్ తెలుగులో నిర్వహించేందుకు గాను ఆహా సిద్ధమైంది. తెలుగు ఇండియన్ ఐడల్ షో కి ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ ఎత్తున ఆడిషన్స్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ముఖ్య పట్టణాల్లో జరిగిన ఆడిషన్స్ వేలాది మంది పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న ట్లుగా సమాచారం అందుతోంది. ఈ పాటల పండుగ కు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ జడ్జిగా వ్యవహరించనున్నాడట. ఇందుకు గాను ఆహా టీం భారీ ఎత్తున తమన్ కి పారితోషికం ఆఫర్ చేసిందట.

తమిళ్ మరియు తెలుగు లో టాప్ మ్యూజిక్ కంపోజర్ అయిన తమన్ జడ్జిగా వ్యవహరించబోతున్న నేపథ్యంలో షో కి భారీగా హైప్ పెరిగే అవకాశం ఉంది. ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్న అతి పెద్ద సింగింగ్ కాంపిటీషన్ అయినా తెలుగు ఇండియన్ ఐడల్ ఓటిటి చరిత్రలో సరికొత్త అధ్యాయం ను లిఖించబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఇతర ఓటిటి లకు గట్టి పోటీ ఇవ్వడంకు గాను పలు వెబ్ సిరీస్ మరియు సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో ని స్ట్రీమింగ్ చేస్తుంది.

బాలకృష్ణ టాక్ షో ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ షో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ రేటింగ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోష్ తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఇండియన్ ఐడల్ తెలుగు జడ్జి గా తమన్ వ్యవహరించడం వల్ల ఒక్క సారిగా షో పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల తమన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన అఖండ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్లాక్ బస్టర్ అన్నట్లు గా నిలిచింది. అందుకే తమన్ ఈ షోకు జడ్జీగా వ్యవహరించడం వల్ల షో స్థాయి పది రెట్లు పెరిగినట్లు అయ్యిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Tags:    
  • SS Thaman 
  • SS Thaman movies 
  • SS Thaman Aha 
  • SS Thaman Aha Indian Idol 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS