• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆకాశ్‌ పూరి 'రొమాంటిక్‌'?

ఆకాశ్‌ పూరి 'రొమాంటిక్‌'?

By - Tupaki Desk
Update: 2018-11-19 03:30 GMT
పూరి పుత్ర ర‌త్నం ఆకాష్ హీరోగా నిరూపించుకోవాల‌న్న క‌సితో ఉన్న సంగ‌తి తెలిసిందే. 2018 ప్ర‌థ‌మార్థంలో `మెహ‌బూబా` లాంటి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైనా - న‌టుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు కాబ‌ట్టి రెండో ప్ర‌య‌త్నం మాత్రం ష్యూర్ షాట్‌గా హిట్ కొట్టాల‌న్న పంతంతో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఆకాష్ నటించే ఈ క్రేజీ చిత్రం కోసం పూరి చాలా సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

పూరి కాంపౌండ్ నుంచి అందిన తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇప్ప‌టికే ఈ సినిమాకి స్క్రిప్టు రెడీ అయ్యింది. పాట‌ల రికార్డింగ్ పూర్త‌యింది. ఇప్ప‌టికే పూరి లొకేష‌న్లు ఫైన‌ల్ చేశాడ‌ట‌. ఎంచుకున్న స్క్రిప్టు పూర్తి రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ జోన‌ర్ కావ‌డంతో ఈ సినిమాని పూర్తిగా గోవా బ్యాక్‌ డ్రాప్ లో తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. డిసెంబ‌ర్ లో ఈ సినిమా ప్రారంభోత్స‌వం చేసి వెంట‌నే షూటింగ్ కి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

మెహ‌బూబాలో ఆకాష్‌ లోని గ‌ట్సీ యాటిట్యూడ్‌ - స్టైల్ యువ‌త‌రానికి న‌చ్చాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆకాష్ కి హీరోగా మంచి భ‌విష్య‌త్ ఉంది. ఇప్పుడు అత‌డి డేరింగ్ & డ్యాషింగ్ అప్పియ‌రెన్స్‌ కి రొమాంటిక్ స్టైల్‌ ని యాడ్ చేసి.. యూత్‌ లో కిక్కెక్కించాల‌న్న ప్లాన్ పూరికి ఉందిట‌. సినిమా ఆద్యంతం ఇంటెన్స్‌ ఎమోష‌న్స్.. ల‌వ్ .. వినోదం.. ప‌క్కాగా ఉండేలా జాగ్ర‌త్త తీసుకున్నారు. ఇక ఈ చిత్రంలో పూరి మార్క్ డైలాగుల‌కు కొద‌వే ఉండ‌దని తెలుస్తోంది. పూరి కేవ్‌ లో ప్ర‌స్తుతం సైలెంట్‌ గా ప‌ని సాగుతోంది. ఇక ఈ చిత్రానికి `రొమాంటిక్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. ఈ సినిమాకి క‌థ‌ - క‌థ‌నం - మాట‌లు పూరి అందిస్తారు. అనీల్ అనే ఓ కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. పూరి సినిమాల‌కు గ్రాఫిక్స్ - వీఎఫ్ ఎక్స్ వంటి బ్యాక్ ఎండ్‌ టెక్నాల‌జీకి సంబంధించి ప‌ర్య‌వేక్షణ అనీల్‌దేన‌ట‌. అత‌డు ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ ఆకాష్‌ ని డైరెక్ట్ చేయ‌నున్నాడు.
Tags:    
  • Akash Puri 
  • Upcoming Film 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS