యూట్యూబ్ లో సౌత్ స్టార్ టీజర్ తడాఖా

Update: 2017-07-26 07:58 GMT
భారత దేశ సినిమా అర్ధం ఇప్పుడు మారుతుంది. ప్రపంచదేశాలలో రకరకాల సినిమా ఇండస్ట్రిలు ఉన్నాయి వాటిలో బాగా పాపులర్ ఇండస్ట్రిలు అతి తక్కువే అన్ని అనుకోవచ్చు. కాని ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాతో ఇండియాలో ఇంకా లోకల్ ఇండస్ట్రిలు కూడా ఉన్నాయి అని అర్ధమైంది వాళ్ళకి. ఇక ఇండియాలో కూడా హింది సినిమా మాత్రమే కాదు చాలానే ఉన్నాయ్ అని తెలిసొచ్చింది.

ఇండియాలో హింది సినిమా తరువాత అంతా క్రేజ్ ఉన్న ఇండస్ట్రిలు అంటే అవి తెలుగు తమిళ్ సినిమా పరిశ్రమలే. సౌత్ సినిమా అంటే జనాలులలో ఎంత క్రేజ్ ఏర్పడిందో  మళ్ళీ యూట్యూబ్ సాక్షిగా రుజువైంది. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే తమిళనాడులో ఇక్కడ ఒక పవన్ కల్యాణ్ కు ఉన్నంత క్రేజ్ ఉంది. మరి అలాంటి హీరో సినిమా ఒకటి రాబోతుంది. అజిత్‌ - కాజల్‌ అగర్వాల్‌ జంటగా శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వివేగం’  టీజర్ - ట్రైలర్ల కు వచ్చిన స్పందన చూస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.  అజిత్ సినిమా కోసం అతని అభిమానులు - సినిమా అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారు అనేది తెలుస్తుంది.

వివేగం సినిమా టీజర్‌  విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌ కు యూట్యూబ్‌ లో ఈ మధ్య కాలంలో  అన్ని సినిమాలు కన్నఎక్కువ లైక్‌ లు దక్కాయి ఏకంగా 5,03,650 లైక్‌ లు వచ్చాయి. ఇది మన దేశంలోనే ఎక్కువ లైక్‌ లు వచ్చిన టీజర్‌ గా రికార్డుకెక్కింది. దీనికన్న ముందు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన  ‘ట్యూబ్‌ లైట్‌’కు 5,03,000 లైకులు వచ్చాయి. వివేక్‌ ఓబెరాయ్‌ - అక్షరహాసన్‌ లు కూడా  ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ  సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. వివేగం సినిమా మన తెలుగులో కూడా  విడుదల కాబోతుంది.​

Full View
Tags:    

Similar News