'ఛలో స్పెయిన్' అంటున్న స్టార్ హీరో చిత్రబృందం!

Update: 2021-02-07 00:30 GMT
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ హీరోలలో స్టార్ హీరో అజిత్ ఒకరు. అజిత్ నటించే ప్రతి సినిమా తెలుగులోకి అనువాదం అవుతుంది. గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు అజిత్. ప్రస్తుతం ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మూవీతో రెడీ అవుతున్నాడు. మొన్నటి వరకు డైరెక్టర్ శివ దర్శకత్వంలో వరుసగా నాలుగు హిట్లను వెనకేసుకున్న అజిత్.. 2019లో అమితాబ్ పింక్ మూవీని రీమేక్ చేసి హిట్ కొట్టాడు. 'నిర్కొండ పార్వై' పేరుతో డైరెక్టర్ హెచ్.వినోద్ ఆ సినిమాను తెరకెక్కించాడు. అయితే ప్రస్తుతం పింక్ మూవీ తెలుగులో 'వకీల్ సాబ్'గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే నిర్కొండ పార్వై తెరకెక్కించిన హెచ్.వినోద్ దర్శకత్వంలోనే అజిత్ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

'వాలిమై' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో హ్యూమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. అయితే లాక్ డౌన్ ముందువరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకున్న వాలిమై సినిమా షూటింగ్.. ప్రస్తుతం 80% పూర్తయినట్లు తెలుస్తుంది. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం.. వాలిమై షూటింగ్ త్వరలో స్పెయిన్ దేశంలో చిత్రీకరించే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తుంది. సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సాంగ్స్ లాంటివి షూట్ చేయనున్నారట. ఇదిలా ఉండగా వాలిమై మూవీని తమిళ, తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ చేస్తారట. టాలీవుడ్ యువహీరో కార్తికేయ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. యువన్ సంగీతం అందిస్తున్నాడు. చూడాలి మరి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో!
Tags:    

Similar News