అయ్యబాబోయ్‌ ఐష్‌.. నువ్వేనా??

Update: 2015-09-16 04:07 GMT
మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ కొత్త రూపం యూత్‌ కి  కిక్కెక్కించ‌డం ఖాయం. ఆరాధ్య‌కు త‌ల్లిగా నిన్న‌టివ‌ర‌కూ ఈ అమ్మ‌డి రూపం వేరు. ఇప్పడు మారిన రూపం తో క్యాట్ ఉమెన్‌ ని త‌ల‌పిస్తోంది. మ‌రోసారి తాళ్‌ - ధూమ్ 2 రోజుల్ని గుర్తు చేస్తోంది. ఆ సినిమాల‌లో సొగ‌స‌రి దేహంతో ఎంత‌గా క‌నిక‌ట్టు చేసిందో ఇప్పుడు కూడా అదే తీరుగా క‌నిక‌ట్టు చేయ‌డానికి రూపు రేఖ‌ల్ని మార్చుకుని ముందుకొస్తోంది.

ఈ భామ రీఎంట్రీ సినిమా జ‌జ్బా ప్ర‌స్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్కులో ఉంది. ఈ చిత్రానికి సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హి స్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే మొద‌టి సాంగ్‌ని రిలీజ్ చేశారు. బందేయా కి యువ‌త‌రం బ్ర‌హ్మ‌ర‌థం పట్టింది. అందులో ఐసూని చూసిన‌వాళ్లంతా షాక్ తిన్నారు. ఇప్పుడు రెండో పాట క‌హానియాన్ రిలీజైంది. ఈ పాట‌లోనూ ఐస్ లుక్ చూసిన‌వారంతా ప‌రేషాన్ అవుతున్నారు. ఐస్ ఈ పాట‌లో స‌రికొత్త రూపంతో క‌నిపించింది.

ఐస్‌.. యోగా, ఎక్స‌ర్‌ సైజుల‌తో మునుప‌టి రూపానికి మారిపోయిందిప్పుడు. శ‌రీరాన్ని అతుక్కుపోయే తోలు వంటి స్పోర్ట్స్ డ్రెస్‌ ని ధ‌రించి ఈ అమ్మ‌డు క‌స‌ర‌త్తులు చేస్తున్న తీరు అద‌ర‌గొట్టేసింది. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 9న‌ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ లోగానే ఐసూ సెగ‌లు కుర్ర‌కారులో గుబులు పుట్టించేందుకే ఇలా స‌మ్మోహ‌న రూపంతో ద‌ర్శ‌న‌మిచ్చింద‌ని అనుకోవాలి.
Tags:    

Similar News