ఫొటోటాక్‌ : సువర్ణ కాస్త యామిని అయ్యిందే

Update: 2020-08-12 23:30 GMT
వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఇంకా కౌసల్య కృష్ణమూర్తి చిత్రాలతో పాటు ఇప్పటి వరకు ఐశ్వర్య రాజేష్‌ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా డీ గ్లామర్‌ పాత్రల్లోనే కనిపించింది. ఎక్స్‌ పోజింగ్‌ కాని స్కిన్‌ షో చేయడం కాని రొమాంటిక్‌ సీన్స్‌ లో కూడా ఇప్పటి వరకు ఆమె నటించలేదు. కాని మొదటి సారి ఆదిశగా ఐశ్వర్య అడుగులు వేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో సువర్ణ పాత్రలో పక్కింటి అమ్మాయిలా అనిపించిన సువర్ణ తాజా సోషల్‌ మీడియా పిక్స్‌ చూస్తుంటే అదే సినిమాలో అల్ట్రా మోడ్రన్‌ అమ్మాయిగా కనిపించిన యామిని మాదిరిగా మారిందనిపిస్తుంది.

హాట్‌ ఫొటో షూట్స్‌ తో వరుసగా ఐశ్వర్య రాజేష్‌ రెచ్చి పోయింది. వరుసగా ఈమె పోస్ట్‌ చేసిన పిక్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఇప్పటి వరకు జిడ్డు ఫేస్‌ తో తలకు ఆయిల్‌ పెట్టి సాదా సీదాగా కనిపిస్తూ వచ్చిన ఐశ్వర్య రాజేష్‌ బాలీవుడ్‌ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా రచ్చ హాట్‌ ఫొటో షూట్‌ తో బయటకు వచ్చింది. ఇకపై సినిమాల్లో కూడా ఇదే స్థాయి గ్లామర్‌ ఉంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు మూడు సినిమాలతో పాటు తమిళంలో పలు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇకపై ఐశ్వర్య రాజేష్‌ ను వెండి తెరపై మెరుపులు మెరిపించే అందాలతో చూస్తామేమో చూడాలి.
Tags:    

Similar News