శ్రీలంకలో ఆరేసుకుంటున్న చిరుత పిల్ల చెల్లి

Update: 2016-09-26 06:04 GMT
రామ్ చరణ్ తో కలిసి చిరుత మూవీలో అరంగేట్రం చేసిన భామ నేహా శర్మకు.. ఓ చిట్టి చెల్లి ఉంది. ఆమె పేరు ఐషా శర్మ. చాలా కాలంగా చెల్లి కెరీర్ ని కూడా హీరోయిన్ గా సెట్ చేసేయాలని నేహ చాలా కాలంగానే ట్రై చేస్తోంది. అయితే.. ఈమె అక్క కంటే రెండాకులు ఎక్కువ చదివింది.

అన్నీ కలిసొస్తే ఈపాటికే హీరోయన్ గా వెలిగిపోవాల్సింది కానీ.. ఇంకా ఆఫర్స్ దగ్గరే ఆగిపోయిన ఈ భామ.. అందాల ఆరేసుకోవడం విషయంలో మాత్రం అందరి కంటే ముందే ఉంటుంది. రీసెంట్ గా శ్రీలంకలో వెకేషన్ గడిపేసిన ఈ సుందరి.. వైట్ కలర్ టూ పీస్ బికినీలో బీచ్ లలో తిరిగేసింది. అలా ఎంజాయ్ చేయడం చాలామంది చేసేదే అయినా.. ఈ పాప బాగా స్పెషల్. అక్కడ తన అందాలు ఏ రేంజ్ లో మెరిసిపోతున్నాయో.. ఫోటోలు తీసుకుని.. తీయించుకుని మరీ నెట్ లో పెట్టేస్తూ ఉంటుంది. టాప్ టు బాటమ్ దాచాల్సినవి మాత్రం దాచేసి.. చూపించేవన్నీ చూపించేస్తూ రెచ్చిపోతున్న ఈ సుందరిని చూసి.. చాలామంది జనాలు లొట్టలేసేసుకుంటున్నారు.

బాలీవుడ్ లో తనకు అవకాశం ఇస్తే మాత్రం ఏ రేంజ్ లో రెచ్చిపోగలదో.. ఈ ఆరేసుకోవడంతోనే చూపించేసింది ఐషా శర్మ. వెకేషన్ లోనే ఇలా రెచ్చిపోతే.. నిజంగా సినిమా ఆఫర్ చేతికి అందితే.. అసలీ భామను ఆపడం సాధ్యమవుతుందా అనుకుంటున్నారు అభిమానులు.
Tags:    

Similar News