అప్పుడు బాహుబలి 1.. ఇప్పుడు రాకా..

అయితే ఈసారి పోస్టర్ సైజ్‌ తో కాదు.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో చేసిన ప్రయోగంతో హిస్టరీ క్రియేట్ చేసింది.

Update: 2026-09-21 13:25 GMT

సినిమా రిలీజ్ కు ముందే గిన్నిస్ రికార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు. తెలుగులో ఒకప్పుడు బాహుబలి 1 సినిమా ప్రమోషన్స్ లో సరికొత్త రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షిస్తే.. ఇప్పుడు అల్లు అర్జున్ రాకా కూడా అదే గిన్నిస్ రికార్డు అందుకుని హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి పోస్టర్ సైజ్‌ తో కాదు.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో చేసిన ప్రయోగంతో హిస్టరీ క్రియేట్ చేసింది.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న రాకా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో డిబేట్ గా మారుతోంది. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన 37 నంబర్ పోస్టర్ కూడా అలాగే హైప్ పెంచింది. అసలు ఆ 37 ఏంటనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. రాకా టీమ్ ఏకంగా 37 మందితో ఒకేసారి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్‌ లో సీన్ ను షూట్ చేసింది.

ఇప్పటివరకు 19 మందితో రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్ చేసిన రికార్డు ఉండగా.. దాన్ని దాదాపు డబుల్ చేస్తూ 37 మందితో కొత్త రికార్డు నమోదు చేసినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో 37 అనే నంబర్ కేవలం పోస్టర్ కోసం పెట్టింది కాదని క్లారిటీ వచ్చేసింది. ఇక్కడే రాకా స్పెషాలిటీ కనిపిస్తోంది. సాధారణంగా సినిమా అంటే కథ, హీరో, హీరోయిన్, పాటలు, యాక్షన్ అంటూ ప్రేక్షకులు అప్డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు.

కానీ అట్లీ తెరకెక్కిస్తున్న రాకా ప్రాజెక్ట్‌ లో టెక్నాలజీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఆ రికార్డు చూస్తే అర్థమవుతుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న విజువల్ డ్రామాకు తగ్గట్టుగానే కొత్త పద్ధతులు యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు సినిమాల్లో విడుదలకు ముందే గిన్నిస్ రికార్డు సాధించిన మూవీల్లో బాహుబలి-1 ప్రత్యేకంగా నిలిచింది. 2015లో ఆ సినిమా కోసం భారీ పోస్టర్‌ ను తీసుకొచ్చి ప్రపంచ రికార్డు సృష్టించారు.

అప్పట్లో ఆ రికార్డు సినిమా ప్రమోషన్‌ కు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇప్పుడు రాకా మాత్రం పూర్తిగా భిన్నమైన వేలో గిన్నిస్ గుర్తింపు తెచ్చుకుంది. అంటే అప్పట్లో బాహుబలి-1 భారీ పోస్టర్‌తో రికార్డు కొడితే.. ఇప్పుడు రాకా టెక్నాలజీ ప్రయోగంతో రికార్డు సృష్టించింది. రెండు సినిమాలు కూడా విడుదలకు ముందే తమ రేంజ్ ను ఇంటర్నేషనల్ లెవెల్ లో చూపించడం గ్రేట్ అని చెప్పాలి.

దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఆ రికార్డుకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ గ్లింప్స్, మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేయనున్నారు. అందులో అసలు ఆ ప్రయోగాన్ని ఎలా చేశారు? 37 మంది ఒకేసారి మోషన్ క్యాప్చర్‌ లో ఎలా భాగమయ్యారు? అనే విషయాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే గిన్నిస్ రికార్డు నమోదు కావడంతో.. రాకా మూవీపై ఉన్న క్యూరియాసిటీ మరింత పెరిగిందని చెప్పాలి.

Tags:    

Similar News