'ఏజెంట్' సర్ప్రైజింగ్ పోస్టర్ స్టన్నింగ్ లుక్ లో అక్కినేని అందగాడు..!

Update: 2021-04-08 12:30 GMT
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ''ఏజెంట్'' అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సరెండర్2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర - సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. నేడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అలానే టైటిల్‌ తో పాటు ఫస్ట్ లుక్‌ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'ఏజెంట్' గా అఖిల్ మేకవర్ చూసిన అభిమానులు థ్రిల్ కి గురయ్యారు. న్యూ హెయిర్ స్టైల్ తో రగ్గ్ డ్ గా పెరిగిన గడ్డం మీసాలతో సిగరెట్ తాగుతున్న అఖిల్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ స్టైలిష్ కాంబో పై అంచనాలు పెంచుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి 'ఏజెంట్' టీమ్ మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఏజెంట్' న్యూ పోస్టర్ లో అఖిల్ స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహంతో 6 ప్యాక్ యాబ్స్ తో అఖిల్ సర్ ప్రైజ్ చేసాడు. ఈ షర్ట్ లెస్ పిక్ చూసిన అభిమానులు అఖిల్‌ కి ఎలాంటి సినిమా పడాలో అలాంటి సినిమానే డైరెక్టర్ సూరి తెరకెక్కించబోతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి ట్వీట్ చేస్తూ.. ''అఖిల్ ఈ బీస్ట్ మోడ్‌ గా రూపాంతరం చెందే ప్రక్రియ 7 నెలల క్రితం ప్రారంభమైంది. మనం కోరుకున్న విధంగా మారాడనికి ప్రతిరోజూ అతను చూపించిన ప్యాషన్ మరియు అంకితభావం చూసి నేను విస్మయం చెందాను. ఏజెంట్ తో అఖిల్‌ ను ఇంతకముందు ఎప్పుడూ చూడని విధంగా చూపిస్తానని నేను హామీ ఇస్తున్నాను'' అని పేర్కొన్నారు.

కాగా, 'ఏజెంట్' చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌ గా నటిస్తోంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'ఏజెంట్' రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 11 నుండి పప్రారంభం కానుంది. 2021 డిసెంబర్ 24 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తో వచ్చిన అఖిల్.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి.
Tags:    

Similar News